Home > టెక్నాలజీ > Chandrayaan 3 success: దేశం గర్విస్తోంది..ఇస్రోపై ప్రశంసల వెల్లువ‌

Chandrayaan 3 success: దేశం గర్విస్తోంది..ఇస్రోపై ప్రశంసల వెల్లువ‌

Chandrayaan 3 success: దేశం గర్విస్తోంది..ఇస్రోపై ప్రశంసల వెల్లువ‌
X

ప్రపంచానికి సాధ్యంకానిది భారత్ సాధించింది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయం వంతమైంది. చందమామ దక్షిణ ధృవంపై భారత్ తొలి అడుగు పెట్టింది. దీంతో దేశప్రజలు ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. చందమామపై నిజంగా అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కడంపై అంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పీఎం, సీఎంలు, వివిధ రంగాల ప్రముఖులు, సామాన్య ప్రజలు ఇస్రోకు అభినందనలు తెలుపుతున్నారు.

ఈ ప్రయోగాన్ని వర్చువల్‌గా చూసిన ప్రధాని మోదీ..ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఇది భారత్ విజయం అన్నారు. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

జగన్ ట్వీట్

చంద్రయాన్ -3 విజయవంతంగాసాఫ్ ల్యాండిగ్ కావడంతో ఇస్రో బృందానికి ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. "నాతో సహా దేశంలోని ప్రతి పౌరుడు గర్వంగా ఫీలవతున్నాడు. ఇస్రో బృందానికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఈ అపురూమైన ఫీట్ ని శ్రీహరికోట నుంచే సాధించాం. ఇది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకం" అని జగన్ ట్వీట్ చేశారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు"చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా అడుగుపెట్టి ఈ ఘనతను సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరించింది. ఇస్రో శాస్త్రవేత్తల అచంచలమైన స్ఫూర్తికి,సంకల్పానికి వందనం చేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే. దీన్నెవరూ ఆపలేరు" అని చంద్రబాబు అన్నారు.

టీమిండియా సంబరాలు..

చంద్రయాన్-3 విజయంపై టీమిండియా సంబరాలు చేసుకుంది. ఉద్విగ్న క్షణాలను లైవ్ లో వీక్షించిన భారత్ ఆటగాళ్లు జాబిల్లిపై అడుగుపెట్టగానే ఆనందంతో ఉప్పొంగిపోయారు. చప్పట్లు కొడుతూ ఇస్రోకు అభినందనలు తెలిపారు.

జూ.ఎన్టీఆర్ అభినందనలు

చంద్రునిపై చంద్రాయన్ -3 కాలు మోపడంతో ఇస్రోకు జూ.ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఇది భారతదేశం గర్వించదగ్గ విషయమని ట్వీట్ చేశారు

వెంకయ్య సంతోషం

వినువిధీలో భారతీయ కీర్తి పతాకను రెపరెపలాడించిన ఇస్రో శాస్త్రవేత్తలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. భారతీయుడిగా హృదయం ఉప్పొంగుతోందన్నారు. చంద్రుని దక్షిణ ధృవంపై ప్రపంచంలోనే తొలిసారి భారత ల్యాండర్ ను పంపడంపై ఘన విజయం అని కొనియాడారు.

Updated : 23 Aug 2023 2:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top