Home > టెక్నాలజీ > ఆదిత్య - ఎల్‌1 ప్రయోగానికి కొనసాగుతోన్న కౌంట్‌డౌన్‌

ఆదిత్య - ఎల్‌1 ప్రయోగానికి కొనసాగుతోన్న కౌంట్‌డౌన్‌

ఆదిత్య - ఎల్‌1 ప్రయోగానికి కొనసాగుతోన్న కౌంట్‌డౌన్‌
X

చంద్రయాన్‌-3 మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు రెడీ అయ్యింది. ఇస్రో చేపడుతున్న ఆదిత్య - ఎల్‌1 కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు(శనివారం) ఉదయం 11.50గంటలకు ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్‌ఎల్వీ సీ-57 నింగిలోకి దూసుకెళ్లనుంది.

సూర్యుడిని దగ్గర నుంచి అధ్యయనం చేయడానికి భారత్ చేపడుతున్న మొట్టమొదటి మిషన్‌ ఇదే. సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను ఇస్రో కొనుగొనుంది. ఈ ప్రయోగంతో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌లపై అధ్యయనం చేసి సమాచారాన్నిసేకరించనున్నారు. ఆదిత్య-ఎల్‌1ను లాగ్రాంజ్ పాయింట్ (L1) చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రవేశపెడతారు. ఈ పాయింట్ వద్ద గురుత్వాకర్షణ శక్తులు బ్యాలెన్స్‌గా ఉండడంతో సూర్యుడి అబ్జర్వేషన్‌కి అణువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ పాయింట్ నుంచి.. ఆదిత్య-ఎల్‌1 రియల్‌ టైమ్‌ సౌర కార్యకలాపాలను, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని గమనించి రికార్డ్ చేస్తుంది. ఆదిత్య ఎల్‌1ను తొలుత లో-ఎర్త్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. అనంతరం ఆర్బిట్‌ను దీర్ఘ వృత్తాకారంగా మారుస్తారు. క్రమంగా శాటిలైట్‌ భూగురుత్వాకర్షణ పరిధిని దాటిపోతుంది. అనంతరం క్రూయిజ్‌ ఫేజ్‌ మొదలవుతుంది. తర్వాత ఎల్‌-1 పాయింట్‌ వద్దనున్న కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి ఎల్‌1 పాయింట్‌ చేరడానికి 4 నెలల సమయం పడుతుంది.

Countdown begins for ISRO solar mission launch at 11:50am tomorrow

isro,aditya l1,solar mission,sun,sun satelite,Sriharikota,ISRO Chief,Somanath,Lagrange point,isro satellite,space weather,

Updated : 1 Sept 2023 8:05 PM IST
Tags:    
Next Story
Share it
Top