Aadhaar Update.. ఆధార్ అప్‌డేట్‌పై ఉడాయ్ కీలక నిర్ణయం.. అప్పటి వరకు..
X
ఆధార్ అప్‌డేట్‌కు గడువు ఈ నెల 14 చివరి తేదీ కావడంతో జనం కంగారుపడుతున్నారు. వర్షాలు, పండగల వల్ల అప్‌డేట్ కష్టంగా మారుతోంది. ఫోన్లు, కంప్యూటర్లు ఉన్నవారు ఎలాగోలా చేసుకుంటున్నారు. అక్షరజ్ఞానం లేని పేదలు, మారుమూల ప్రాంతాలవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రం ఆధార్ అప్‌డేట్ గడువును మరోసారి పెంచింది. మరో మూడు నెలల పాటు ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) తెలిపింది.
ఈ గడువు దాటిన తర్వాత అప్ డేట్ చేసుకోవాలంటే నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అడ్రస్, జన్మదినం, జెండర్ వివరానుల తగిన గుర్తింపు పత్రాలతో అప్ లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ తీసుకుని పదేళ్లయిన వారు కూడా తమ వివరాలు అప్ డేట్ చేసుకోవాలి. మై ఆధార్ పోర్టల్‌లో అప్ డేట్ సదుపాయం ఉంది. డాక్యుమెంట్ అప్‌డేట్ కేటగిరీలో పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామాను మార్చుకోవచ్చు.