Home > టెక్నాలజీ > Realme New Sale : రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ ఇదిగో..ఈ ఫోన్లపై డిస్కౌంట్

Realme New Sale : రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ ఇదిగో..ఈ ఫోన్లపై డిస్కౌంట్

Realme New Sale : రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ ఇదిగో..ఈ ఫోన్లపై డిస్కౌంట్
X

(Realme New Sale) వాలండెన్స్ పురస్కరించుకుని రియల్‌మీ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి 12 వరుకు వాలండెన్స్ డే కొత్త సేల్ నిర్వహించనున్నారు.ఈ సెల్‌లో భాగంగా నార్జో సిరిస్ ఫోన్లపై డిస్కౌంట్ అందించనుంది. అమెజన్, రియల్‌మీ వెబ్‌సైట్లలో మొబైల్స్ కొనుగోలు చేయొచ్చు. సేల్‌లో భాగంగా రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ 5జీ (Realme Narzo 60x), నార్జో ఎన్‌ 55, నార్జో ఎన్‌ 53 ఫోన్లపై కంపెనీ డిస్కౌంట్‌ ప్రకటించింది. నార్జో 60 ప్రో 5జీ (Realme Narzo 60 Pro 5G) 8జీబీ + 128జీబీ, 12జీబీ+1 టీబీ వేరియంట్‌పై రూ.2 వేలు డిస్కౌంట్‌ ఇస్తోంది. 12జీబీ+256జీబీ వేరియంట్‌పై రూ.4వేలు డిస్కౌంట్‌ కూపన్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ ధర రూ.21,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఇక రియల్‌మీ నార్జో 60 5జీ (Realme Narzo 60 5G) 8జీబీ+128జీబీ మోడల్‌ ధర రూ.17,999 కాగా.. సేల్‌లో భాగంగా రూ.14,999కే అందించనున్నారు. 256జీబీ వేరియంట్‌ రూ.16,999కి దొరుకుతుంది. నార్జో 60ఎక్స్‌ (Realme Narzo 60x 5G) ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌పై రూ.2వేలు డిస్కౌంట్‌ ఇస్తోంది. నార్జో ఎన్‌ 55 ( Realme Narzo N55) స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,999, నార్జో ఎన్‌ 53 (Realme Narzo N53) ఫోన్‌ ధర రూ.7,499కి విక్రయించనున్నారు.

మరోవైపు ప్రేమికుల రోజు పురస్కరించుకుని ఐఫోన్ల ధరలను తగ్గించింది. Apple iPhone 15 అనేది Apple ఫోన్ సిరీస్‌లో అత్యంత సరసమైన అండ్ డబ్బుకి విలువైన మోడల్. ఐఫోన్ 15 లాంచ్ అయినప్పటి నుండి అనేక ఆన్‌లైన్ సేల్స్ ధర తగ్గింది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఐఫోన్ల ధరలను తగ్గించింది. భారతదేశంలో, 128GB స్టోరేజ్ తో Apple iPhone 15 ధర రూ.79,900. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రస్తుతం వాలెంటైన్స్ డేకి ముందు ఆపిల్ ఐఫోన్ 15 ను భారీ తగ్గింపుతో అందిస్తోంది. దింతో ఈ ఐఫోన్ కేవలం రూ.39,949కే లభిస్తుంది.





అంతే కాదు, కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి కార్డ్‌ని ఉపయోగించి కొనుగోళ్లు చేయడం ద్వారా రూ.4000 వరకు ఆదా చేసుకోవచ్చు. దింతో ధరను రూ.68,999కి తగ్గవచ్చు.ఇంకా, Flipkart మీ పాత Apple iPhone 14ని రూ. 33,505కి మార్చుకునే అవకాశాన్ని అందిస్తుంది. దీంతో యాపిల్ ఐఫోన్ 15 ధర రూ.39,949కి తగ్గింది.Apple iPhone 15 డైనమిక్ ఐలాండ్ డిజైన్‌లో నాచ్‌లెస్ డిజైన్, సన్నని బెజెల్‌లు, వెనుక భాగంలో ఫ్రాస్టెడ్ గ్లాస్ అండ్ కొంచెం పెద్ద కెమెరా లెన్స్ ఉన్నాయి. మరొక గుర్తించదగిన మార్పు కింద అంచున ఉన్న USB-C పోర్ట్.యాపిల్ ఐఫోన్ 15 ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ మోడళ్లలో ఒకటి. దీనిలో ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి. కొత్త చిప్‌సెట్, డైనమిక్ ఐలాండ్, USB-C పోర్ట్ ఇంకా 48MP కెమెరా సెటప్‌ ఉంది.వాలెంటైన్స్ డే కోసం మీ ఇష్టమైన వారికీ గిఫ్ట్ ఇవ్వడానికి ఇది ఒక అద్భుతమైన అప్షన్. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో ధర తగ్గింపు వినియోగదారులకు గణనీయమైన సేవింగ్స్ అందిస్తుంది.




Updated : 6 Feb 2024 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top