Home > టెక్నాలజీ > Lunar mission Postponed : జపాన్‎కు మరోసారి ఎదురుదెబ్బ..చంద్రయాన్ ప్రయోగం వాయిదా

Lunar mission Postponed : జపాన్‎కు మరోసారి ఎదురుదెబ్బ..చంద్రయాన్ ప్రయోగం వాయిదా

Lunar mission Postponed  : జపాన్‎కు మరోసారి ఎదురుదెబ్బ..చంద్రయాన్ ప్రయోగం వాయిదా
X

స్పేస్‎లో నిరంతరం ప్రయోగాలు చేసేందుకు జపాన్ ప్రయత్నీస్తూనే ఉంటుంది. 2001 నుంచి ఇప్పటి వరకు జపాన్, మార్స్ సహా ఇతర గ్రహాలపై ల్యాండర్లను విజయవంతంగా ప్రయోగించింది. ఈ దేశం అంతరిక్షంలో చేపట్టిన 36 ప్రయోగాల్లో 35 ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. అయితే చంద్రుడి విషయంలో మాత్రమే జపాన్‎కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగానికి కూడా 30 నిమిషాల ముందు బ్రేక్ పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జపాన్‌ చేపట్టిన లూనార్‌ మిషన్‌ ప్రయోగం మరోసారి వాయిదా పడింది.

దీంతో తదుపరి డేట్‏ను జపాన్ త్వరలో ప్రకటించనుందని సమాచారం.





ఇస్రో కృషితో చంద్రుడిపై సురక్షితంగా ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. ప్రస్తతుం చంద్రుడిపై తన అధ్యయనాన్ని ప్రారంభించింది. ఆగస్టు 23న శాస్త్రవేత్తలు ల్యాండర్‌ను జాబిల్లి దక్షిణ ధ్రువంపై సక్సెస్‎ఫుల్‎గా దింపారు. చంద్రునిపై కాలుమోపిన 4వ దేశంగా భారత్ కీర్తిని సంపాదించింది. అందులోనూ దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను ల్యాండ్ చేసిన మొదటి దేశం భారతే. ఈ క్రమంలో జపాన్ చంద్రునిపై ల్యాండర్‌ను దింపేందుకు కొన్నేళ్లుగా తెగ ప్రయత్నిస్తోంది. కానీ, జపాన్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వెదర్ ఎఫెక్ట్ కారణంగా వరుసగా 3వ సారి ల్యాండర్ ప్రయోగానికి బ్రేక్ పడింది. ప్రయోగానికి 30 నిమిషాల ముందు జపాన్ మరోసారి వాయిదా వేసింది.





అన్నీ అనుకూలిస్తే ఇవాళ ఉదయం 5.25 గంటలకు ఈ ప్రయోగాన్ని స్టార్ట్ అయ్యేది. ఈ ప్రాజెక్టుకు జపాన్ మూన్ స్నిపర్ అని నామకరణం చేసింది. ఈ ప్లాన్‌లో ఎక్స్-రే మిషన్, చంద్రునిపై ల్యాండర్‌ను ల్యాండింగ్ చేసే ప్రక్రియలు ఉన్నాయి. కానీ, జపాన్ ప్లాన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బలమైన గాలులు వీయడం, వాతావరణం అల్లకల్లోలగా మారడంతో జపాన్ వెనక్కి తగ్గింది. దీంతో చంద్రుడి చెంతకు చేరాలని జపాన్‌ చేస్తున్న ప్రయత్నం 3వ సారి వాయిదా పడినట్లైంది.

ఈ ప్రయోగం తదుపరి తేదీని త్వరలో జపాన్ ప్రకటించనుందని సమాచారం. సెప్టెంబర్ 15 నాటికి ప్రయోగం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.



Updated : 28 Aug 2023 3:49 PM IST
Tags:    
Next Story
Share it
Top