Home > టెక్నాలజీ > E-iconic Bikes : త్వరలో ఈ-ఐకానిక్ టూవీలర్స్.. మార్కెట్లోకి ఆ బైక్స్

E-iconic Bikes : త్వరలో ఈ-ఐకానిక్ టూవీలర్స్.. మార్కెట్లోకి ఆ బైక్స్

E-iconic Bikes : త్వరలో ఈ-ఐకానిక్ టూవీలర్స్.. మార్కెట్లోకి ఆ బైక్స్
X

అప్పట్లో లూనా టూవీలర్ బైక్స్ చాలా చోట్ల దర్శనమిచ్చేది. 50 సీసీ మోపెడ్‌తో ఉండే ఈ బైక్ మార్కెట్లో బాగా అమ్ముడుపోయేది. అయితే కాలక్రమేణా ఆ లూనా బైక్‌ ఉత్పత్తులను నిలిపేసింది. కైనటిక్ కంపెనీ ఆ బైక్ తయారీని ఆపేయడంతో ఆ తర్వాత మార్కెట్‌లో ఆ వాహనం కనుమరుగైంది. అయితే మళ్లీ ఇప్పుడు ఆ లూనా బైక్ కొత్త రూపంలో కొత్త తరహాలో దర్శనమివ్వనుంది. మళ్లీ రోడ్లపై పరుగులు పెట్టనుంది.

ఇప్పటి తరానికి ఈ బైక్ అంతగా గుర్తుండిపోవచ్చు. కానీ అప్పట్లో ఈ బైక్ మార్కెట్‌ను ఓ ఊపు ఊపేసిందని చెప్పాలి. ఇ-లూనా రూపంలో ఈ బైక్ రీఎంట్రీ ఇస్తోంది. ఈనెలలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కైనటిక్ గ్రీన్ సంస్థ ఈ బైక్స్‌ను ఉత్పత్తి చేయనుంది.





మార్కెట్లోకి ఎల్ఎంఎల్ బైక్స్

అప్పట్లో మార్కెట్ పోటీని తట్టుకోలేక ఎల్ఎంఎల్ సంస్థ కనుమరుగైంది. దాని పూర్తి పేరు లోహియా మెషినరీ లిమిటెడ్ కాగా అప్పట్లో బజాజ్ చేతక్‌కు ఇది గట్టి పోటీనిచ్చింది. ఆ తర్వాత దివాళా తీసింది. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో మళ్లీ మార్కెట్లో తన సత్తాను చూపించాలనుకుంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్టార్ పేరుతో ప్రీమియం సెగ్మెంట్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎల్ఎంఎల్ తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతోంది.





రీ ఎంట్రీ ఇవ్వనున్న 2 కంపెనీలు

మొత్తానికి కనుమరుగైన రెండు కంపెనీలో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాయి. కైనటిక్ గ్రీన్, ఎల్ఎంఎల్ సంస్థలు కొత్త రూపంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఓలా, టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి సంస్థ దూసుకెళ్తున్నాయి. ఇకపై హోండా, యమహా, సుజుకీ సైతం ఈ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీకి సిద్దం అవుతున్నాయి. ఈ ఐకానిక్ బ్రాండ్లు ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీలో రాణిస్తాయో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.





Updated : 5 Feb 2024 10:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top