Home > టెక్నాలజీ > 1.6 కోట్ల కి.మీ. దూరం నుంచి భూమికి తొలి లేజర్ మెసేజ్

1.6 కోట్ల కి.మీ. దూరం నుంచి భూమికి తొలి లేజర్ మెసేజ్

1.6 కోట్ల కి.మీ. దూరం నుంచి భూమికి తొలి లేజర్ మెసేజ్
X

ఖగోళ పరిశోధనల్లో అద్భుత ఘటన ఆవిష్కృతమైంది. 1.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి తొలిసారి లేజర్ కమ్యూనికేషన్ అందింది. అది కూడా కేవలం 50 సెకన్లలోనే ప్రయాణించి చేరుకుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు ఈ ఘన విజయం సాధించారు. దీన్ని ‘తొలి వెలుగు’ (ఫస్ట్ లైట్) అని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. రోదసిలో ప్రయాణిస్తున్న ‘సైకీ’(psyche) వ్యోమనౌకలోని డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ (డీఎస్ఓసీ) పరికరం నుంచి ఈ నెల 14 లేజర్ బీమ్డ్ కమ్యూనికేషన్ అందింది. 1.6 కోట్ల కి.మీ దూరం భూమికి, చంద్రుడి మధ్య దూరానికి 40 రెట్లకు సమానం. అంత దూరం నుంచి భూమికి ఆప్టికల్ కమ్యూనికేషన్ అందడం ఇదే తొలిసారి.

నాసా శాస్త్రవేత్తలు అక్టోబర్ 13న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ‘సైకీ’ని అంతరిక్షంలోకి పంపారు. దానికీ, కాలిఫోర్నియాలోని హేలీ టెలిస్కోప్‌కూ మధ్య ‘సైక్ స్పేస్‌’ లింక్ ఏర్పడింది. డీఎస్‌ఓస్ నుంచి నియర్ ఇన్‌ఫ్రారెడ్ ఫొటాన్లు 50 సెకన్లలో సైకీ నుంచి భూమికి చేరుకున్నాయి. ‘‘రోదసి పరిశోధన్లో ఇది మైలురాయి. భవిష్యత్తులో ఎక్కువ డేటా కమ్యూనికేషన్లు, హై రిజల్యూషన్ చిత్రాలు పంపడానికి, లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఈ ప్రయోగాలు దోహదపడతాయి’’ అని నాసా టెక్నాలజీ డెమానిస్ట్రేషన్స్ డైరెక్టర్ ట్రూడీ కోర్టెస్ చెప్పారు. ఈ ప్రయోగంలో భారత సంతతికి చెందిన అబీ బిశ్వాస్ కూడా పాలుపంచుకున్నారు. డీఎస్ఓసీ ప్రాజెక్ట్ టెక్నాలజిస్టుగా ఆయన పనిచేస్తున్నారు. 16 సైకీ అనే గ్రహశకలంపై పరిశోధనల కోసం ‘సైకీ’ స్పేస్ క్రాఫ్ట్‌ను పంపారు. ఇది 2029లో ఆ గ్రహశకలపు కక్ష్యలోకి వెళ్తుంది.


Updated : 23 Nov 2023 10:33 PM IST
Tags:    
Next Story
Share it
Top