ట్విట్టర్ లోగో మార్చనున్న మస్క్.. X ఇది ఫిక్స్
X
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత అందులో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన ఆయన.. మరిన్ని సంస్కరణలకు తెర తీశారు. ఇదివరకే ట్విట్టర్ లోగో బ్లూ బర్డ్ స్థానంలో కుక్క ఇమేజ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తరువాత ఏమైందో తెలియదు.. తన నిర్ణయాన్ని కెనక్కి తీసుకుని మళ్లీ ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగోను పునరుద్ధరించారు.
మళ్లీ ఆయన బుర్రలో ఏం మార్పు వచ్చిందో తెలియదు గానీ తాజాగా మరోసారి లోగో మార్చాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్క పిట్టే తమ లోగోలో ఉందని, దీన్ని మార్చాలనే యోచనలో ఉన్నామని అన్నారు. ఇకపై అన్ని పక్షులకు వీడ్కోలు పలుకుతామని పేర్కొన్నారు. మున్ముందు ఎలాంటి లోగోను ఫిక్స్ చేయాలనే విషయంపైనా లీక్ ఇచ్చారు ఎలాన్ మస్క్. X అనే అక్షరాన్ని పరిశీలిస్తోన్నామని మస్క్ చెప్పారు. ఇది యూజర్లకు నచ్చితే- రేపటి నుంచే ఈ లోగో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇదివరకు ఎలాన్ మస్క్ తన వ్యాపార కార్యకలాపాలను ఎక్స్ కార్ప్‌గా మార్చిన విషయం తెలిసిందే. దీన్ని ప్రతిబింబించేలా ఎక్స్ అనే పేరును ట్విట్టర్ లోగోగా మార్చాలనే నిర్ణయానికొచ్చారు.
మస్క్‌కు X అనే అక్షరం అంటే విపరీతమైన ఇష్టం. ఈ విషయం కొత్తగా తెలిసిందేమీ కాదు. ట్విటర్ సీఈవోగా లిండా యాకరినో బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా కంపెనీని ఎవ్రీ థింగ్ యాప్ ఎక్స్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇక ట్విటర్‌లోని అన్ వెరిఫైడ్ ఖాతాల నుంచి ప్రత్యక్ష సందేశాలు ఉంచడాన్ని పరిమితం చేస్తున్నట్లు శనివారం మస్క్ ప్రకటించారు.
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023