Home > టెక్నాలజీ > Bajaj CNG Bike : మొట్టమొదటి సీఎన్ జీ బైక్ తీసుకొస్తున్న బజాజ్

Bajaj CNG Bike : మొట్టమొదటి సీఎన్ జీ బైక్ తీసుకొస్తున్న బజాజ్

Bajaj CNG Bike : మొట్టమొదటి సీఎన్ జీ బైక్ తీసుకొస్తున్న బజాజ్
X

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్ జీ బైక్ తీసుకురానున్నట్టు వెల్లడించింది. వచ్చే త్త్రెమాసికంలో దీన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎండీ రాజీవ్ బజాజ్ ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. సీఎన్ జీ మోటార్ సైకిల్ ద్వారా ఇంధన ధర, నిర్వహన ఖర్చు 50-60 శాతం మేర తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద బైక్స్​ తయారీ సంస్థగా బజాజ్​ ఆటో.. సీఎన్​జీ మోటార్​సైకిల్స్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాటు చేసుకుంటోంది. ఇవి.. 2025 ఆర్థిక ఏడాదిలోనే మార్కెట్​లోకి అడుగుపెడతాయని సమాచారం. ఈ బైక్స్​.. అటు పెట్రోల్​తో పాటు ఇటు సీఎన్​జీపైనా నడుస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో సీఎన్‌జీ కార్లు అందుబాటులో ఉన్నాయి.





వాటిల్లో దాదాపు అన్ని.. ఐసీఈ ఇంజిన్​ మోడల్స్​కి సీఎన్​జీ టచ్​ ఇచ్చినవే!అయితే.. ఒక్క బైక్​ లాంచ్​ చేసి, దానికి ఎంతటి ఆదరణ లభిస్తోంది? అని చూసి, మరో బైక్​ని రూపొందించడం కాకుండా.. వరుసగా సీఎన్​జీ బైక్స్​ని తయారు చేసి, వాటిని మార్కెట్​లో విడుదల చేయాలన్న స్ట్రాటజీతో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యూయెల్​ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని.. ఈ సీఎన్​జీ బైక్స్​ని రూపొందిస్తున్నట్టు ఎండీ తెలిపారు. బజాజ్ ఆటో పల్సర్, ఇతర బ్రాండ్ల మోటార్ సైకిళ్లను 90 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కంపెనీ చేతక్‌ను 2020లో ఎలక్ట్రిక్ అవతార్‌లో తిరిగి ప్రవేశపెట్టింది. ప్రత్యామ్నాయ శక్తి వనరుపై వ్యాఖ్యానిస్తూ, శర్మ మాట్లాడుతూ, సీఎన్ జీ అనేది పర్యావరణ హితమైనది.. తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. సీఎన్ జీ నడిచే వాహనాలు ముడి దిగుమతులను తగ్గించే ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ఉన్నాయి.




Updated : 5 March 2024 12:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top