NASA : చంద్రుడిపైకి తొలి ప్రైవేట్ ల్యాండర్.. అమెరికా రికార్డ్
X
చంద్రునిపైకి తొలి ప్రైవేట్ ల్యాండర్‌ను పంపి అమెరికా మరో రికార్డు నెలకొల్పింది. అమెరికా పంపిన నోవా-సి ల్యాండర్ ప్రస్తుతం మార్గం మధ్యలో ఉంది. కేప్ కానవెరాల్ లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లు నోవా-సి ల్యాండర్‌ను అంతరిక్షంలోకి పంపాయి. ప్రస్తుతం ఈ ల్యాండర్ చంద్రున్ని చేరుకునేందుకు వెళ్తోంది. తాజాగా ఆ ల్యాండర్ తీసిన భూమి ఫోటోలను అమెరికా కంపెనీ అయిన ఇనిషియేటివ్ మెషిన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Deployment of @Int_Machines IM-1 confirmed pic.twitter.com/daPrWFkVng
— SpaceX (@SpaceX) February 15, 2024
ల్యాండర్ పంపిన ఫోటోల్లో భూమి వజ్రపు తునకలా మెరిసిపోతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందనేది గతంలో కూడా చాలా ఫోటోల్లో చూశాం. కానీ నోవా-సి పంపిన ఫోటోలు అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 22వ తేదిన నోవా-సి ల్యాండర్ చంద్రునిపై దిగనుంది. అంతా సవ్యంగా సాగితే చంద్రుడిపై దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్‌గా నోవా-సి చరిత్రలో నిలువనుంది.
అంతేకాకుండా 1972 తర్వాత చంద్రుడిపైకి అమెరికా పంపిన తొలి ల్యాండర్‌గా అది రికార్డులకెక్కనుంది. ఇకపోతే చంద్రునిపైకి మరోసారి మానవ సహిత వ్యోమనౌకలను పంపేందుకు అమెరికా కృషి చేస్తోంది. అందుకోసమే అర్టెమిస్ మూన్ ప్రోగ్రామ్‌ను కూడా చేపట్టినట్లు నాసా తెలిపింది. ప్రస్తుతం నోవా-సి ల్యాండర్ ఆ ప్రాజెక్టులో తొలి అడుగు అని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరోవైపు చంద్రయాన్3 సక్సెస్‌తో ఉన్న ఇస్రో త్వరలోనే వ్యోమగాములను చంద్రునిపైకి పంపేందుకు సిద్దమవుతోంది. అలాగే భారత స్పేస్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
Deployment of @Int_Machines IM-1 confirmed pic.twitter.com/daPrWFkVng
— SpaceX (@SpaceX) February 15, 2024