Home > టెక్నాలజీ > ఫెస్టివల్ సేల్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ అదిరే ఆఫర్స్..

ఫెస్టివల్ సేల్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ అదిరే ఆఫర్స్..

ఫెస్టివల్ సేల్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ అదిరే ఆఫర్స్..
X

ప్రస్తుత డిజిటల్ యుగంలో అంతా ఆన్లైన్లోనే.. ఏం కొనాలన్నా, ఏ తినాలన్నా ఆన్లైన్నే ఎంచుకుంటున్నారు జనం. వచ్చేది దసరా, దీపావళి సీజన్. ఈ పండుగ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సిద్ధమయ్యాయి. భారీ ఆఫర్స్తో కస్టమర్స్ను ఆకట్టుకోనున్నాయి.

బిగ్ బిలియన్ డేస్ అని ఫ్లిప్ కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని అమెజాన్ ఫెస్టివల్ సేల్స్ను ప్రకటించాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు జరగనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 10వరకు జరగనుంది. ఈ సేల్స్లో భాగంగా రెండు ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లను అందించనున్నాయి.

మొబైల్స్, ల్యాప్ టాప్స్ సహా ఎలక్ట్రాన్ పరికరాలు తక్కువ ధరకు లభించనున్నాయి. అదేవిధంగా ఫ్యాషన్ కు సంబంధించిన వస్తువులపై కూడా మంచి ఆఫర్స్ అందుబాటులోకి రానున్నాయి. ఫ్లిప్ కార్ట్ సేల్ లె ఐసీఐసీ బ్యాంక్, యాక్సిస్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తూ అదనంగా 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అదేవిధంగా అమెజాన్ సేల్లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్టుతో కొనుగోలు చేస్తే అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు.


Updated : 12 Sept 2023 10:28 PM IST
Tags:    
Next Story
Share it
Top