Flipkart Big Dussehra Sale 2023: ఫ్లిప్కార్ట్ బిగ్ దసరా సేల్స్.. ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
X
దసరా పండగ కోసం జనం కొత్త బట్టలు కొనడం ఆనవాయితీ. స్మార్ట్ ఫోన్ల కాలం వచ్చాక.. ‘అదిరిందయ్యా చంద్రం.. కొత్త ఇల్లు, కొత్త భార్య..’ టైపులో కొత్త ఫోన్లు, కొత్త టీవీలు, కొత్త ఇయర్ ప్యాడ్స్, స్మార్ట్ వాచీలు వంటివి కొనేస్తున్నారు. జనాన్ని మరింత ఆకట్టుకుని సేల్స్ పెంచుకోవడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ కంపెనీలు కూడా భారీ డిసౌంట్లు ఇస్తున్నాయి. ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ పేరుతో అతిపెద్ద సేల్ నిర్వహించిన ఫ్లిప్కార్ట్ మరో బిగ్ సేల్స్‌కు తెరలేపింది. దసరా పండగను పురస్కరించుకుని ’బిగ్ దసరా సేల్’ను అక్టోబర్ 22 నుంచి 29 వరకు 8 రోజుల పాటు నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు 21 నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కోటక్, ఆర్‌బీఎల్, ఎస్‌బీఐ, యాక్సిస్ తదితతర బ్యాంకుల క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఫోన్లు, వాచ్‌లు, ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, దుస్తులపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
వీటిపై తగ్గింపు
గూగుల్ పిక్సెల్ 7 ఏ ఫోన్ రూ.43,999 కాగా రూ.35,999లకే కొనొచ్చు. రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ ఫోన్ ధరను రూ.32,999 నుంచి రూ.29,999లకు తగ్గించారు. మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ ధరను రూ.34,999 నుంచి రూ.26,999లకు తగ్గించారు. ఒప్పో రెనో10 5జీ ఫోన్ అసలు ధర రూ.38,999 కాగా రూ.32,999లకు కొనొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఫోన్ ధరనున రూ.85,999 నుంచి రూ.39,999లకు, నథింగ్ ఫోన్ 2 ఫోన్ ధరను రూ.59,999 నుంచి రూ.49,999లకు తగ్గించారు. పొకో ఎఫ్5 5జీ ఫోన్ ధర రూ.34,999 నుంచి రూ.23,999లకు తగ్గింది. వివో టీ2 ప్రో 5జీ, మోటో జీ54 ఫోన్లు కూడా తగ్గింపు ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఐ-ఫోన్ 13 (128 జీబీ) అసలు ధర రూ.59,900 నుంచి రూ.51,999లకు అందుబాటులో ఉంది. ఆయన బ్యాంకుల క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.