Home > టెక్నాలజీ > google users alert: గూగుల్ యూజర్లకు వార్నింగ్.. అకౌంట్ డిలీట్ కావద్దంటే ఇలా చేయండి

google users alert: గూగుల్ యూజర్లకు వార్నింగ్.. అకౌంట్ డిలీట్ కావద్దంటే ఇలా చేయండి

google users alert: గూగుల్ యూజర్లకు వార్నింగ్.. అకౌంట్ డిలీట్ కావద్దంటే ఇలా చేయండి
X

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తమ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. చాలాకాలంగా యాక్టివ్ గా లేని గూగుల్ అకౌంట్స్ ను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. తఈ ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలుపుతూ.. ఇప్పటికే గూగుల్ యూజర్లకు వార్నింగ్ మెయిల్స్ పంపించింది. గూగుల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కు సంబంధించి అన్ని అకౌంట్స్ కు యాక్టివ్ పరిమితిని గూగుల్ రెండేళ్లకు పొడిగించింది. అంటే వినియోగదారులు రెండేళ్లపాటు తమ అకౌంట్స్ ను వినియోగించకపోయినా.. యాక్టివ్ గా లేకపోతే ఆ అకౌంట్స్ ను పర్మినెంట్ గా తొలగించనుంది.





అయితే నేరుగా గూగుల్ అకౌంట్ లో లాగిన్ కాకుండా.. గూగుల్ యాప్స్ ద్వారా లాగిన్ అయిన వాళ్ల అకౌంట్స్ డిలీట్ చేయమని తెలిపింది. ప్రస్తుతం డిలీట్ చేయడానికి 8 నెలల ముందే నోటిఫికేషన్ ఇస్తున్నామని, అయినా పట్టించుకోకపోతే అకౌంట్స్ డిలిట్ కానున్నాయి. ఒకసారి డిలిట్ అయిన అకౌంట్ పర్మినెంట్ గా డిలిట్ అవుతుంది. అంతేకాకుండా ఒకసారి డిలిట్ అయిన గూగుల్ అకౌంట్.. అదే పేరుతో మరో అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యం కాదని గూగుల్ తెలిపింది.




Updated : 21 Aug 2023 2:06 PM GMT
Tags:    
Next Story
Share it
Top