Home > టెక్నాలజీ > పానీపూరీకి పట్టం కట్టిన గూగుల్

పానీపూరీకి పట్టం కట్టిన గూగుల్

పానీపూరీకి పట్టం కట్టిన గూగుల్
X

ఓ చిన్న పూరీ...అందులో బంగాళదుంప ముద్ద, పుదీనా నీరు వేసుకుని అలా నోట్లో పెట్టుకుంటే....పులుపు, కారం, ఉప్పు రుచులతో నోరు బ్లాస్ట్ అవ్వాల్సిందే. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ. దేశంలో ఏ మూలకు వెళ్ళినా ఇవి దొరుకుతాయి. వీధికి రెండు, మూడు పానీ పూరీ బండ్లు ఉంటాయి. ఎన్నేళ్ళు అయినా తన ప్రత్యేకతను, ఆదరణను నిలబెట్టుకుంటున్న పానీపూరికి గూగుల్ కూడా పట్టం కట్టింది.

విదేశాల్లో ఉన్న దేశీయులు భారతీయ వంటలను, తినుబండారాలను చాలా మిస్ అవుతుంటారు. అందులో చాలా ఎక్కవు మిస్ అయ్యేది ఏంటో తెలుసా....పానీ పూరీని. ఇప్పడు విదేశాల్లో కూడా పానీపూరీ దొరుకుతోంది కానీ...మన దేశంలో, మన వీధుల్లో...రోడ్డు పక్కన నిలబడి తినే మజా మాత్రం ఎక్కడారాదు. ఆ రుచీ రాదు. అందుకే వాళ్ళు ఇక్కడకు రాగానే ఫస్ట్ తినే పదార్ధం పానీ పూరీ. విదేశీ ప్రముఖులు మనదగ్గరకు వస్తే మనం పెట్టేది కూడా అదే. ఆ మధ్యెప్పుడో జపాన్ ప్రధాని మన దేశానికి వస్తే మన ప్రధాని మోడీ స్వయంగా ఆయనకు పానీ పూరీ తినిపించారు. జపాన్ ప్రధానికి అది విపరీతంగా నచ్చేసి మూడో, నాలుగో లాంగిచారు కూడా. అదీ పానీపూరీ గొప్పతనం. అందుకే ఈరోజు దానికి గూగుల్ ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ఆ ఆకృతులతో డూడుల్ చేయడమే కాక ఒక ఇంటరాక్టివ్ గేమ్ ను కూడా తీసుకొచ్చింది. గేమ్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉండడంతో నెటిజన్లు దాన్ని తెగ ఆడుతున్నారు.

అయితే పానీ పూరీకి ఈ రోజు ఎందుకు అంత స్పెషలో మీకు తెలుసా. ఎందుకు దానికి ఈరోజు గూగుల్ డెడికేట్ చేసిందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. 2015 జులై 12న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక రెస్టారెంట్ 51 రకాల రుచికరమైన పానీపూరీలను తయారుచేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఆ రికార్డ్ను ఇప్పటివరకూ ఎవరూ బ్రేక్ కూడా చేయలేదు. అందుకే గూగుల్ ఆ రోజును మళ్ళీ గుర్తు చేస్తూ...పానీపూరీ డూడుల్ ను రూపొందించింది.

పానీపూరీకి చాలాపేర్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గోల్ గప్పా అంటారు. బెంగాల్ లో దీన్ని పుచ్కా అంటారు. మధ్యప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పానీ కే పటాషే అని పిలుస్తారు. గప్ చుప్ అని మరో పేరు.ఫుల్కి, పటాషి, పడక, టిక్కీ ఇలా మరికొన్ని పేర్లు కూడా దీనికి ఉన్నాయి.



Updated : 12 July 2023 3:41 PM IST
Tags:    
Next Story
Share it
Top