Google Maps : గూగుల్ కొత్త ఫీచర్.. లొకేషన్ షేరింగ్కు వాట్సాప్ వాడనక్కర్లే
X
ఏ ప్రాంతాలకు వెళ్లాలన్నా.. సులువుగా అక్కడికి రీచ్ అయ్యేందుకు గూగుల్.. మ్యాప్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూట్ మ్యాప్ పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ వసతులు అందిస్తుంది. అయితే గూగుల్ అందించే రియల్ టైం లొకేషన్ షేర్ చేయాలంటే.. తప్పనిసరిగా వాట్సాప్ లాంటి మరో యాప్ పై ఆధార పడాల్సి ఉంటుంది. ఇకపై వేరే యాప్ల వంక చూడాల్సిన అవసరం లేదంటోంది గూగుల్. దానికోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఏ యాప్ సాయం అవసరం లేకుండా.. కేవలం సాధారణ మెసేజ్ తో రియల్ టైం లొకేషన్ ను షేర్ చేయొచ్చు.
వాట్సాప్ లో రియల్ టైం లొకేషన్ షేర్ చేసినప్పుడు 15 నిమిషాల నుంచి 8 గంటల వరకు.. ఆ లొకేషన్ షేర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే గూగుల్ కొత్త ఫీచర్ తో ఆ లిమిట్ ఆప్షన్ ఉండదు. అవసరం లేనప్పుడు షేరింగ్ టైం ఆప్షన్ ను నిలిపేయొచ్చు. వాట్సాప్ లాంటి యాప్స్ వాడని వారికి.. ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. అయితే లొకేషన్ షేర్ చేసిన వ్యక్తి ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ తప్పక లాగిన్ అయి ఉండాలి.