Home > టెక్నాలజీ > గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. వాటివి వాడితే డబ్బులు లూటీ

గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. వాటివి వాడితే డబ్బులు లూటీ

గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. వాటివి వాడితే డబ్బులు లూటీ
X

సైబర్ నేరగాళ్లు చొరబడని చోటు లేదు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని దోపిడీకి అనుకూలంగా మార్చుకుంటూ వేలకోట్లు కొల్లగొడుతున్నారు. ఎక్కవ మంది వాడే డిజిటల్ సేవలు లక్ష్యంగా చేసుకుని బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. మన దేశంలో యూపీఐ చెల్లింపుల ఎక్కువగా వాడుతున్న గూగుల్ పేపైన సైబర్ నేరస్తుల కన్నుపడింది. స్క్రీన్ షేరింగ్ యాబ్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని, యూజర్లు అప్రమత్తంగా ఉండాలని గూగుల్ పే తెలింది. ట్రన్సాక్షన్లు జరిపేటప్పుడు ఫోన్‌లో స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌లను వాడొద్దని, వాటిని ఓపెన్ చేసి ఉంచొద్దని కోరింది. ఈ యాప్స్ ‌ నుంచి నేరస్తులు మొబైల్‌లోని గూగుల్ పే యాప్ డేటాను తస్కరించి ఫోన్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలు గుల్ల చేస్తున్నారని హెచ్చరించింది.

ఎనీ డెన్స్, టీమ్ వ్యూయర్, ఎనీ స్క్రీన్, స్క్రీన్‌స్ట్రీమ్, లెట్స్‌వ్యూ తదితర యాప్స్‌లను యూజర్లు స్క్రీన్ షేరింగ్ కోసం వాడుతుంటారు. వీటి ద్వారా వేరే ప్రాంతంలోని సైబర్ నేరస్తులలు మొబైల్‌పై నియంత్రణ సాధిస్తారు. ఏటీఎం, డెబిట్‌కార్డు వివరాలు దొంగిలించడంతోపాటు ఓటీపీలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తుంటారు. దీన్ని అడ్డుకోవడానికి గూగుల్ పలు చర్యలు తీసుకుంటోంది. యూజర్ల వైపు నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటిని అరికట్టొచ్చని తెలిపింది. థర్డ్‌పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకోమని తమవైపు నుంచి ఎవరూ కోరరని, అలాంటి రిక్వెస్టులు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరింది.

Updated : 22 Nov 2023 7:56 PM IST
Tags:    
Next Story
Share it
Top