Home > టెక్నాలజీ > Hero New Bike : ఈ బైక్ గుర్తుందా.. మార్కెట్లోకి మళ్లీ వస్తోంది

Hero New Bike : ఈ బైక్ గుర్తుందా.. మార్కెట్లోకి మళ్లీ వస్తోంది

Hero New Bike : ఈ బైక్ గుర్తుందా.. మార్కెట్లోకి మళ్లీ వస్తోంది
X

అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసి.. యూత్ అట్రాక్ట్ చేసిన కరిజ్మా బైక్ మార్కెట్ లోకి మళ్లీ వస్తోంది. 2003లో హీరో కంపెనీ తొలుత కరిజ్మ బైక్ ను లాంచ్ చేసి.. కొన్ని మోడల్స్ ను లాంచ్ చేసింది. తర్వాత కొంతకాలం షట్ డౌన్ అయిన ఈ మోడల్.. తిరిగి మళ్లీ లాంచ్ చేయనున్నారు. కరిజ్మా 210 ఎక్స్ ఎంఆర్ పేరుతో ఈసారి హైఎండ్ మోడల్ ను విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 29న ఈ బైక్ లాంచ్ కానుంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను నియమించింది. గతంలో కూడా కరిజ్మాకు హృతిక్ రోషనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

కాగా, ఈ బైక్ కు సంబంధించిన టీజర్ లను హీరో ఇప్పటికే లాంచ్ చేయగా.. ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈ బైక్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే.. 210 సీసీ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ తో వస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇందులో టాప్ స్పీడ్ గరిష్ఠంగా 143 కిలోమీటర్లు. డ్యూయల్ టోన్ కలర్ థీమ్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డిజిటల్ ఇన్సుట్రుమెంట్ క్లస్టర్ లాంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది బ్లూటూత్ కనెక్టవిటీతో వస్తుంది. ప్రస్తుతం దీనికి ఎంత ప్రైజ్ పెడతారన్ని విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.









Updated : 25 Aug 2023 4:58 PM IST
Tags:    
Next Story
Share it
Top