Hero Mavrick 440: హీరో నుంచి కాస్ట్లీ బైక్.. అదిరిపోయే లుక్.. పూర్తి విశేషాలివీ..!
X
గతకొన్ని రోజులుగా బైకర్స్ ను ఊరిస్తున్న మేవ్రిక్ 440ను.. హీరో కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. మంగళవారం హీరో వరల్డ్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్ లో మేవ్రిక్ 440 బైక్ ను లాంచ్ చేసింది. కాగా హీరో కంపెనీ ఇప్పటివరకు తీసుకొచ్చిన వాటిలో ఇదే కాస్ట్లీ బైక్ కావడం గమనార్హం. ఈ బైక్ తో పాటు హీరో ఎక్స్ ట్రీమ్ 125సీసీ బైక్ ను కూడా లాంచ్ చేసింది. ఫిబ్రవరి నెలలో ప్రారంభం కాబోయే మేవ్రిక్ 440 బైక్ ల ధర రూ.2.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉండొచ్చని అంచనా. ప్రీ బుక్ చేసుకుంటే.. ఏప్రిల్ నుంచి డెలివరీలు మొదలవనున్నాయి. పోయినేడాది హీరో- హార్లే పార్ట్ నర్షిప్ లో వచ్చిన హార్లేడేవిడ్‌సన్ ఎక్స్ 440ను సక్సెస్ వేరియంట్ ను.. మేవ్రిక్ 440గా తీసుకొచ్చారు.
మేవ్రిక్ 440 ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ బైక్ 440 సీసీ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. 36 ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ బైక్.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400, స్పీడ్ 400, హార్లే ఎక్స్440, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, క్లాసిక్ 350, హోండా సీబీ 350కు గట్టి పోటీ ఇవ్వనుంది.