Home > టెక్నాలజీ > Hero Xtreme 125R: 66 లీటర్ల మైలేజీతో.. హీరో బైక్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

Hero Xtreme 125R: 66 లీటర్ల మైలేజీతో.. హీరో బైక్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

Hero Xtreme 125R: 66 లీటర్ల మైలేజీతో.. హీరో బైక్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి
X

మిడిల్ క్లాస్ బడ్జెట్ వారికి ఫస్ట్ గుర్తొచ్చే బైక్ కంపెనీ ఏదైనా ఉందంటే అది హీరోనే. చాలాకాలంగా బడ్జెట్ సెగ్మెంట్ లో బైక్ లను తీసుకొస్తుంది. ఇప్పుడు పూర్తి కొత్తగా 125cc సెగ్మెంట్ లో కొత్త బైక్ ను విడుదల చేసింది. అగ్రెసివ్ డిజైన్, స్టైలిష్ లుక్స్‌తో కంపెనీ కొత్త 125cc బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌ను తీసుకొచ్చింది. అత్యంత అధునాతన ఫీచర్స్ తో ఈ బైక్ ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. కాగా ఈ బైక్ పల్సర్ 150, టీవీఎస్ రైడర్ 125కి గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇందులోని ప్రొజెక్టర్ హెడ్ లైట్, స్లిమ్ LED టర్న్ ఇండికేటర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ బైకు సంబంధించిన పూర్తి స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఈ బైక్ ను ఇంజిన్ బ్యాలెన్సర్ టెక్నాలజీతో, స్మూత్ పవర్ రెస్పాన్స్, ఇన్ స్టంట్ టార్క్ తో 125 సీసీ మోటార్ ను తయారుచేశారు. ఈ ఇంజిన్ 11.4బీహెచ్‌పీని అందిస్తుంది. 5.9 సెకన్స్ లో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కాగా చాలామంది దీని మైలేజ్ చూసి కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ బైక్ లీటర్ కు 66 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. 276mm ఫ్రంట్ డిస్క్‌తో సెగ్మెంట్ ఫస్ట్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంది. వీటితో పాటు ఎల్ఈడీ వింకర్‌లు, టైలాంప్, కాంపాక్ట్ మఫ్లర్, సెగ్మెంట్ ఫస్ట్ వీల్ కవర్ ఉన్నాయి. దీని ధర.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఐబీఎస్- రూ. 95,000 ఉండగా.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ - రూ. 99,500 ఉంది. ఇప్పటికే 125cc ప్రైజ్ సెగ్మెంట్ లో ఉన్న గ్లామర్, సూపర్ స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టీఈసీ, పల్సర్ 125, టీవీఎప్ రైడర్ కు ఈ బైక్ గట్టి పోటీ ఇస్తుంది.

Updated : 3 Feb 2024 9:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top