Glamor New Bike : ఆ ఐదు బైక్లకు సవాల్.. మార్కెట్లోకి కొత్త గ్లామర్ బైక్
X
దేశంలోని అతిపెద్ద టూ వీలర్ వెహికల్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. 125 సీసీ సెగ్మెంట్ లో కొత్త బైక్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. అప్‌డేటెడ్ డిజైన్, అప్‌డేటెడ్ న్యూ ఫీచర్స్, ఇంజిన్లతో హీరో గ్లామర్ బైక్ ను లాంచ్ చేసింది. ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే హోండా ఎస్పీ125, హోండా షైన్, టీవీఎస్ రైడర్, బజాజ్ పల్సర్ 125 బైక్ లు ఉన్నాయి. వాటికి కాంపిటీషన్ గా హీరో గ్లామర్ ను తీసుకొస్తోంది. 125 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో హీరో ఈ బైక్ ను తీసుకొస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది.
ఇందులో మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ విత్ శ్రౌడ్స్, సింగిల్ పాడ్ రిఫ్లెక్టర్ హెడ్ లైట్ సెటప్ కూడా ఉన్నాయి. క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ-బ్లాక్, స్పోర్ట్స్ రెడ్-బ్లాక్ కలర్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు ఒక లీటర్ ఈ-20 పెట్రోల్ తో 63 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కాగా, దీని డ్రమ్ వేరియంట్ ధర రూ.82,348, డిస్క్ వేరియంట్ ధర రూ.86, 348 ఉంటుంది.