Home > టెక్నాలజీ > 2024 Hero Pleasure: మాడిఫైడ్ లుక్స్తో కొత్త హీరో ప్లెజర్.. ధర, స్పెసిఫికేషన్స్పై ఓ లుక్కేయండి

2024 Hero Pleasure: మాడిఫైడ్ లుక్స్తో కొత్త హీరో ప్లెజర్.. ధర, స్పెసిఫికేషన్స్పై ఓ లుక్కేయండి

2024 Hero Pleasure: మాడిఫైడ్ లుక్స్తో కొత్త హీరో ప్లెజర్.. ధర, స్పెసిఫికేషన్స్పై ఓ లుక్కేయండి
X

స్కూటీల్లో హీరో ప్లెజర్కు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తేలికగా ఉంటుంది. నడపడం చాలా ఈజీ అని.. చాలామంది ఈ హీరో ప్లెజర్ స్కూటీని కొనేందుకు ఇష్టపడుతుంటారు. నచ్చిన రంగు, డిజైన్స్ లో అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంటుంది. కాగా ప్రస్తుతం హీరో ప్లెజర్ కొత్త వేరియంట్ ను కంపెనీ లాంచ్ చేయబోతుంది. BS6, మొబైల్ చార్జింగ్ సపోర్ట్, సరికొత్త డిజైన్ తో ఆకట్టుకుంటుంది. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే..

పాత ప్లెజర్ డిజైన్ తో పోల్చితే.. ఈ కొత్త వేరియంట్ లుక్ కాస్త డిఫరెంట్ గా ఉంది. ఆప్రాన్, ఫ్రంట్ ఫెండర్ ఇండికేటర్స్, పొజిషన్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ రీడిజైన్ చేశారు. స్కూటీ బాడీ డిజైన్ లో ఎలాంటి మార్పులు లేవు. ట్విప్ మీటర్, ఫ్యుయెల్ గేజ్, స్పీడ్, సైడ్ స్టాండ్ ఇండికేషన్ కోసం స్పీడో మీటర్ ను అమర్చారు. 102 సీసీ ఇంజిన్ తో వస్తుంది. ఇది గరిష్టంగా.. 7.8 ఎన్ఎమ్ టార్క్, 6.7 బీహెచ్పీ పవర్ ను రిలీజ్ చేస్తుంది. ఇరువైపుల డ్రమ్ బ్రేక్స్ తో వస్తుంది. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ తో స్కూటీ బ్రేకింగ్ పనితీరు ఆకట్టుకుంటోంది.

అంతేకాకుండా ఇందులో.. ఎయిర్ కూలింగ, సింగిల్ సిలిండర్ డబుల్ వాల్వ్ 102.0 సీసీ ఇంజిన్ తో వస్తుంది. సెల్ఫ్ స్టార్ట్ మెకానిజం ఇందులో ప్లస్ పాయింట్. బూట్ స్పెస్ ను ఇంకాస్త పెంచారు. ఫ్యుయల్ గేజ్, పాస్ లైట్ ఇందులో ఉన్నాయి. డ్రమ్ బ్రేకుల ద్వారా బ్రేకింగ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. మీటర్ కన్సోల్ రైడర్స్ ను ఆకట్టుకుంటుంది. దీని ఎక్స్ షో రూం ధర రూ.78 వేల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్ ను బట్టి ధర మారిపోతుంది.




Updated : 13 Jan 2024 9:58 PM IST
Tags:    
Next Story
Share it
Top