Honda compact scooter:హోండా మడత స్కూటర్.. ధర ఎంతంటే?
X
ఈవీ రంగం విస్తరిస్తోంది. దాంతో పాటు టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. కొత్త కొత్త ఆవిష్కరణలకు రూపుదిద్దుకుంటోంది. ప్రతీ కంపెనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఇతర కంపెనీలతో పోటీ పడుతుంది. అదే బాటలో హోండా కంపెనీ నడుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హోండా.. సూట్ కేస్ సూజ్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారుచేసి, అంతర్జాతీయ మార్కెట్ లో విడుదల చేసింది. దీని ధర రూ.72వేలు ఉండగా నవంబర్ లో భారత మార్కెట్ లోకి విడుదల చేయనుంది.
స్పెసిఫికేషన్స్:
ఈ హోండా మోటో కాంపాక్ట్ మినీ ఈ స్కూటర్.. కేవలం 19 కిలోల బరువు ఉంటుంది. పరిమాణం 38 అంగుళాలు. మడత పెట్టినప్పుడు 28 అంగుళాలకు తగ్గుతుంది. పరిమాణంలో చిన్నదే అయినా దీని బ్యాటరీ 6.8 ఏహెచ్ పవర్ ను కలిగిఉంది. గరిష్టంగా 16ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 19 కీలోమీటర్లలు.. గరిష్టంగా 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కంఫర్ట్ పరంగా ఏ మాత్రం రాజీ పడలేదు. ఇది జీరో ఎమిషన్ బైక్ కావును సిటీ, కాలేజీ క్యాంపస్ ల్లో ప్రయాణించొచ్చు. ఆన్ బోర్డ్ స్టోరేజ్, చార్జ్ గేజ్, డిజిటల్ స్పీడోమీటర్ ఇందులో స్పెషాలిటీ.