Home > టెక్నాలజీ > వెరీ ఈజీ.. కొత్త ఓటర్​ ఐడీ కోసం ఇలా అప్లై చేయండి

వెరీ ఈజీ.. కొత్త ఓటర్​ ఐడీ కోసం ఇలా అప్లై చేయండి

వెరీ ఈజీ.. కొత్త ఓటర్​ ఐడీ కోసం ఇలా అప్లై చేయండి
X

ఈ ఏడాది చివర్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2023 (Telangana Assembly Elections 2023) జరగనున్నాయి. దీంతోపాటు పార్లమెంట్​ ఎన్నికలకూ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటరు ఐడీ తప్పనిసరి. 18 సంవత్సరాలు నిండిన వారంతా తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఓటరు గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. అయితే ఓటర్​ ఐడీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్​లైన్​ సర్వీస్​ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వద్ద గంటల కొద్దీ క్యూలో వేచి చూడాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని.. మీ మొబైల్​ నుంచే అప్లై చేసుకోవచ్చు. అదెలాగంటే..

కొత్తగా ఓటర్​ ఐడీ కోసం అప్లై చేసే వారు ..ముందుగా అధికారిక వెబ్​సైట్​ NVSP (National Voter's Service Portal)ని సంప్రదించాలి.

National Voter's Service Portal లింక్​పై క్లిక్​ చేస్తే మరో పేజీలోకి రీడైరెక్ట్​ అవుతుంది.

ఆ పేజీలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న FORMS.. కుడివైపున SERVICES అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.

FORMS సెక్షన్​లోకి వెళితే.. అక్కడ ఫారం-6 కనిపిస్తుంది.

దానిపై క్లిక్​ చేస్తే.. మరో పేజీలోకి తీసుకెళ్తుంది.అక్కడ LOGIN/ SIGN UP అని అడుగుతుంది.

కొత్త యూజర్​ అయినట్లయితే మీ మొబైల్​ నెంబర్ ఎంటర్​ చేయడం ద్వారా SIGN UP కావాల్సి ఉంటుంది.

SIGN UP పూర్తయిన వెంటనే LOGIN పేజీలోకి తీసుకెళ్తుంది.

ఇక్కడ మీ ఫోన్​ నెంబర్​, పాస్​వర్డ్​ ఎంటర్​ చేసి లాగిన్​ అవ్వాలి.

లాగిన్​ అయ్యాక అక్కడ కనిపించే ఫారం-6లో మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

మీ వివరాలు నింపే క్రమంలో ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

1. పాస్​పోర్ట్​ సైజ్ ఫొటో

2.డేట్​ ఆఫ్​ బర్త్​ ఫ్రూఫ్​ కోసం మీ ఆధార్​ కార్డు

3.రెసిడెన్స్​ ఫ్రూఫ్​ కోసం మీ తండ్రి/భర్త ఆధార్​ కార్డు

అన్ని వివరాలు కరెక్టుగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత Preview and Submitపై క్లిక్​ చేస్తే సరి.

మీ అప్లికేషన్ సక్సెస్​ఫుల్​ అని స్క్రీన్​పై చూపిస్తుంది. దాంతోపాటు Reference Number జనరేట్ అవుతుంది.

ఈ Reference Numberను జాగ్రత్తగా పెట్టుకోండి.తర్వాత మీ అప్లికేషన్​ స్టేటస్​ను చూసుకునేందుకు ఈ నెంబర్​ కీలకం.

చివరగా ఓ వారం తర్వాత చెక్​ చేసుకుంటే.. మీ కొత్త ఓటర్​ ఐడీ కార్డు మీ కళ్ల ముందు కనిపిస్తుంది.

ఇక మీ ఓటర్​ ఐడీ స్టేటస్​ చెక్ చేసుకోవాలంటే ముందుగా చెప్పిన కుడివైపున ఉన్న SERVICES సెక్షన్​లోని TRACK Application Status అనే ఆప్షన్​ ను క్లిక్ చేయాలి .అక్కడ మీ Reference Number ఎంటర్ చేసి, STATE సెలెక్ట్​ చేసుకుంటే మీ అప్లికేషన్ స్టేటస్​ తెలుసుకోవచ్చు.

మీ కొత్త ఓటర్​ ఐడీ అప్లికేషన్​ కోసం రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో.. చూశారుగా.. ఇంట్లోనే కూర్చుని రూపాయి ఖర్చు లేకుండా.. 10 నిమిషాల్లో ఓటర్​ ఐడీకి అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అప్లై చేసుకోండి.

Updated : 13 Aug 2023 9:52 AM IST
Tags:    
Next Story
Share it
Top