PM Surya Ghar Muft Bijli Yojana : కేంద్రం 300 యూనిట్ల ఉచిత కరెంట్.. అప్లై చేసుకోండిలా
X
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత కరెంట్ తరహాలో.. కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ (ఇంటింటికీ ఉచిత కరెంట్) అనే పథకాన్ని ప్రవేశపెట్టనుంది. గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత కరెంట్ అందించడమే ఈ పథకం లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. ఈ పథకానికి రూ.75వేల కోట్లు ఖర్చవుతుండగా.. దేశంలోని కోటి మందికి లబ్దిచేకూరనుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం సెన్సేషనల్ గా మారింది. కాగా ఈ పథకం కోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే..
• ముందుగా అధికారిక పోర్టలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎన్నుకోవాలి. అందులో కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
• తర్వాత కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్ తో లాగిన్ అయి.. రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ పూర్తైన తర్వాత డిస్కం నుంచి అనుమతి వచ్చే వరకు వెయిట్ చేయాలి. అనుమతి వచ్చిన తర్వాత డిస్కం నుంచి వచ్చిన విక్రేతల ద్వారా సోలార్ ప్లాంట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
• ఇన్ స్టాలేషన్ పూర్తైన తర్వాత.. ఆ ప్లాంట్ వివరాలు పోర్టల్ లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి.
• నెట్ మీటర్ కూడా ఇన్ స్టాల్ చేసిన తర్వాత.. డిస్కం అధికారులు చెకింగ్ కు వస్తారు. తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ అందిస్తారు.
• ఈ రిపోర్ట్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత.. మీ బ్యాంకు అకౌంట్ వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ ను పోర్టల్ సబ్మిట్ చేయాలి. అనంతరం 30 రోజుల్లో మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.