Hyundai Motor : ఎగిరే కారు.. గంటలోనే 200 కిమీ ప్రయాణం
X
గ్లోబల్ టెక్నాలజీ షో 'CES 2024'లో హ్యుందాయ్ మోటార్ గ్రూప్ తన సరికొత్త ఎయిర్ టాక్సీ మోడల్ నమూనాను ఆవిష్కరించింది, ఈ గ్లోబల్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్ చేసేందుకు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.
ఈ ట్యాక్సీని హ్యుందాయ్ మోటార్ గ్రూప్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ సూపర్‌నల్ రూపొందించింది. US-ఆధారిత ఎయిర్ టాక్సీ యూనిట్, లాస్ వెగాస్‌లో జరిగిన ట్రేడ్ షోలో S-A2, ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) విజయవంతంగా పూర్తి చేసింది. 2028లో ఈ ఎయిర్ టాక్సీ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తుంది. సాధరణ వాణిజ్య విమానయాన భద్రతా స్థాయిలను తగ్గట్టుగా ఈ ఎయిర్ టాక్సీ మోడల్ తయారు చేసినట్లుగా సూపర్నల్ తెలిపింది. S-A2 అనేది V-టెయిల్ విమానం, గంటకు 120 మైళ్ల వేగంతో 1,500 అడుగుల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది. సాధారణ రవాణా అవసరాలను తీర్చడానికి కూడా ఈ ఎయిర్ టాక్సీ ఉపయోగపడుతుందని సంస్థ ప్రతి నిధులు తెలిపారు. ఇక ఎయిర్ టాక్సీ ఎడిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఆర్కిటెక్చర్‌తో పాటు ఎనిమిది ఆల్-టిల్టింగ్ రోటర్‌లను కలిగి ఉంటుంది. వర్టికల్ ల్యాండింగ్‌తో పాటు టేకాఫ్ సమయంలో 65 డెసిబుల్స్, గాల్లో ఎగిరే సమయంలో 45 డెసిబుల్స్ శబ్దం మాత్రమే బయటకు వస్తుంది. Supernal ఇంజనీరింగ్ బృందాలు, హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఆటోమోటివ్ డిజైనర్లతో సాయంతో S-A2ను స్టైలీష్ లుక్‌తో తీర్చిదిద్దారు.