Home > టెక్నాలజీ > ISRO: కొత్తేడాదికి ఇస్రో గ్రాండ్‌ వెల్‌కమ్‌.. !

ISRO: కొత్తేడాదికి ఇస్రో గ్రాండ్‌ వెల్‌కమ్‌.. !

ISRO: కొత్తేడాదికి ఇస్రో గ్రాండ్‌ వెల్‌కమ్‌.. !
X

(ISRO) ప్రపచమంతా అట్టహాసంగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకోగా, ఇస్రో కొత్తేడాదిని కొత్త ప్రయోగంతో మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. 2024లో తొలి ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి నిర్వహించనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో ఇది 60వ ప్రయోగం. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది.. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.

ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేరుకోనుంది. అనంతరం రాకెట్‌లో నాలుగో స్టేజ్‌ అయిన పీఎస్‌4 అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో తిరువనంతపురం ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్‌ కాలేజ్‌ విద్యార్థినులు తయారుచేసిన విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం నేపథ్యంలో చెంగాళమ్మ అమ్మవారిని ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ ఆదివారం దర్శించుకున్నారు.




Updated : 1 Jan 2024 7:29 AM IST
Tags:    
Next Story
Share it
Top