అదిరే ఫీచర్లతో Infinix GT 10 Pro స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?
X
ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో స్మార్ట్ ఫోన్.. అగస్ట్ 3న ఇండియన్ మార్కెంట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్లో అందుబాటులో ఉండనుంది. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. GT 10 ప్రో లుక్, డిజైన్ నథింగ్ ఫోన్ 2ని పోలి ఉంటుంది. దీంతో ఈ ఫోన్ నథింగ్ 2కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
5జీ సపోర్ట్ చేసే ఈ ఫోన్.. మీడియాటెక్ డిమెన్‌సిటీ 1300 ప్రాసెసర్తో వస్తోంది. ఈ ఫోన్120hz రిఫ్రెష్ రేట్ సహా 6.8 ఇంచెస్ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్తో వస్తుంది. 5000mah బ్యాటరీ సహా 160w ఛార్జర్ సపోర్ట్ను కంపెనీ అందించనుంది. 108mp మెయిన్ కెమెరాతో పాటు సెల్పీల కోసం 32mp ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
ఈ మొబైల్ ధర 20వేల లోపే ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ 5వేల ఆర్డర్లకు కంపెనీ ప్రో గేమింగ్ కిట్ ను అందించనుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేస్తే 2వేల ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది. కొన్ని క్రెడిట్ కార్డులపై 6నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. 20వేల కన్నా తక్కువ రేంజ్ లో మొబైల్ కొనుగోలు చేసేవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్గా అందుబాటులో ఉండనుంది.