Infinix Smart 8 specifications: లుక్ అదిరింది.. అద్భుతమైన ఫీచర్స్ తో ఇన్ఫినిక్స్ ఫోన్
X
ఇండియన్ మార్కెట్ లో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ను తీసుకొచ్చింది. గతేడాది నవంబర్ లో నైజీరియా మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 మోడల్ ఫోన్ ను ఇప్పుడు భారత మార్కెట్ కు తీసుకొచ్చింది. మీడియాటెక్ హీలియో జీ 36 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ ఇందులో మెయిన్ హైలైట్. 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.7,499గా నిర్ణయించారు. ఆన్ లైన్ లో ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. అయితే లాంచ్ ఆఫర్ కింద.. 6,748కే ఈ ఫోన్ ను అందిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ్టి నుంచే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ వైట్, రెయిన్‌బో బ్లూ, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
స్పెసిఫికేషన్స్ చూసుకుంటే.. ఐఫోన్ లో ఉండే డైనమిక్ ఐలాండ్ తో ఫోన్ చూడ్డానికి అందంగా ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లే ఈ ఫోన్ కు మరో ప్లస్ పాయింట్. ఎక్స్ పాండబుల్ మెమరీ కింద.. ఫోన్ స్టోరేజీని కార్డ్ తో 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. 50 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది.