Home > టెక్నాలజీ > Iphone 15: నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ.. ఎక్కడంటే..?

Iphone 15: నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ.. ఎక్కడంటే..?

Iphone 15: నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ.. ఎక్కడంటే..?
X

ఐఫోన్ 15 కోసం యాపిల్ యాజర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. యాపిల్ స్టోర్లు, వెబ్ సైట్లో ఐఫోన్ 15అందుబాటులోకి రాగా ఈ కామర్స్ సైట్ అమెజాన్లోనూ సేల్కు వచ్చింది. అయితే అమెజాన్ లో అమ్మకానికి వచ్చిన ఈ ఐఫోన్ 15 కస్టమర్ల చేతికి రావాలంటే కొన్ని రోజులు పాటు వెయిట్ చేయాల్సిందే. అయితే ఐఫోన్ 15ను ఎప్పుడెప్పుడు చేతిలోకి తీసుకోవాలా అని ఎదురు చూస్తున్న యాపిల్ ప్రియులకు ఓ ఇన్స్టెంట్ డెలివరీ ప్లాట్ ఫాం బంపర్ ఆఫర్ ఇచ్చింది.

యాపిల్ ఐఫోన్ 15 లాంఛ్ అయిన రోజు నుంచి కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు అందిస్తామని ఇన్స్టెంట్ డెలివరీ ప్లాట్ ఫాం బ్లింకిట్ ప్రకటించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ వేరియెంట్ ఫోన్లను కేవలం 9 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని కంపెనీ కో ఫౌండర్, సీఈఓ అల్బిందర్ ధిండా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. యాపిల్ ఐఫోన్ 15 సీరిస్ లో మొత్తం నాలుగు వేరియెంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ కస్టమర్లకు అందించేందుకు యాపిల్ రీసెల్లర్ యూనికార్న్ ఏపీఆర్ సొల్యూషన్స్తో బ్లింకిట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రస్తుతానికి ఢిల్లీ NCR, ముంబై, పూణే నగరాల్లో మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉన్నట్లు చెప్పింది.

సెప్టెంబర్ 12న యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సీరిస్ లాంఛ్ చేయగా.. సెప్టెంబర్ 15 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ వేరియెంట్లు సెప్టెంబర్ 22 నుంచి ఇండియాలో సేల్స్ ప్రారంభమయ్యాయి. 128జీబీ, 256 జీబీ, 612 బీజీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్లో అందుబాటులోకి వచ్చాయి.

ఇక రేట్ల విషయానికొస్తే 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఐఫోన్ 15 ధర రూ. 79,900, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900గా నిర్ణయించారు. ఇక 256 జీబీ ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రేటు 1,59,900లుగా ఫిక్స్ చేశారు. వాస్తవానికి ఐఫోన్ 15కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో యాపిల్ స్టోర్లలో ఇప్పటికే స్టాక్ అయిపోయినట్లు సమాచారం. కోరుకున్న వారందరికీ ఐఫోన్ 15 చేతికి అందాలంటే నవంబర్ వరకు ఆగాల్సిందేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Updated : 22 Sept 2023 4:58 PM IST
Tags:    
Next Story
Share it
Top