iPhone 15: ప్రీ బుక్కింగ్స్ మొదలైనయ్.. ముందే ఎలా బుక్ చేసుకోవాలంటే?
X
ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. అద్భుతమైన, యూజర్లకు అవసరమైన కొత్త ఫీచర్లతో ఈ సిరీస్ ను తీసుకొచ్చారు. వండర్ లస్ట్ ఈవెంట్ లో ఐఫోన్ 15 సిరీస్ తో పాటు వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను మార్కెట్లోకి లాంచ్ చేశారు. వీటిలో కొన్నింటిని రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారుచేశారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 48 మెగాపిక్సల్ కెమెరా, 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్ తో ఈసారి టాప్ ఫీచర్స్ ను తీసుకొచ్చారు. కాగా ఇవాళ్టి నుంచి (సెప్టెంబర్ 15) ఐఫోన్ ప్రీబుకింగ్ మొదలయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి సేల్స్ లో ఉంటుంది. ఈ ఫోన్ల ధర రూ.79,900 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు యాపిల్ మార్క్ లైటెనింగ్ పోర్ట్ తో రాగా.. ఇప్పుడు టైప్ సీతో వస్తున్నాయి. ఈ ఫోన్లను యాపిల్ అఫీషియల్ సైట్, ఆన్ లైన్ రీటైల్ స్టోర్స్ ద్వారా ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ సైట్స్ లో కొనుగోలు చేసుకుంటే బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద కాస్త డబ్బులు తగ్గొచ్చు.