Home > టెక్నాలజీ > iPhone 15 : మరింత చౌకగా ఐఫోన్.. భారీ డిస్కౌంట్

iPhone 15 : మరింత చౌకగా ఐఫోన్.. భారీ డిస్కౌంట్

iPhone 15 : మరింత చౌకగా ఐఫోన్.. భారీ డిస్కౌంట్
X

ఇప్పుడందరూ ఐఫోన్‌లపై పడ్డారు. చాలా మంది ఐఫోన్‌లనే కొనాలనుకుంటున్నారు. దీంతో ఐఫోన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. అయితే అధిక ధరల కారణంగా చాలా మంది మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసమే ప్రముఖ ఆన్‌లైన్ సెల్లింగ్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ శుభవార్త తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్ 15ను అందిస్తోంది. ఐఫోన్15 బేస్ వేరియంట్లో 128 జీబీ ఫోన్ ఇప్పుడు అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది.

గతంలో ఐఫోన్ 15 బేస్ వేరియంట్ ధర 79,900గా ఉండేది. ఆ ధరను తగ్గిస్తూ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఐఫోన్15 ధర రూ.65 వేల కంటే తక్కువగా లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజాలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 బేస్ వేరియంట్ అయిన 128 జీబీని కేవలం 66,999లకే అందిస్తోంది. దీంతో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. ఒక వేళ హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొంటే 2000 అదనపు డిస్కౌంట్ లభించనుంది. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.24 వేల వరకూ బోనస్ కూడా ఇవ్వనున్నారు.

ఇకపోతే ఐఫోన్15 ఫీచర్లు చూస్తే 1179 x 2556 పిక్సల్స్ రిజల్యూషన్ ఉంది. అలాగే 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లేతో పాటు IOS 17 ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ, 6 జీబీ ర్యామ్ + 256 జీబీ, 6 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఐఫోన్ 15 అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్15ను కొనేయండి.


Updated : 12 Feb 2024 9:09 AM IST
Tags:    
Next Story
Share it
Top