Home > టెక్నాలజీ > iphone new update : ఐఫోన్ యూజర్లు అలర్ట్ కావాలి.. వెంటనే ఆ పని చేయాలి..

iphone new update : ఐఫోన్ యూజర్లు అలర్ట్ కావాలి.. వెంటనే ఆ పని చేయాలి..

iphone new update  : ఐఫోన్ యూజర్లు అలర్ట్ కావాలి.. వెంటనే ఆ పని చేయాలి..
X

‘స్టేటస్ సింబల్’ దాటిపోయి అందరి చేతుల్లోకి వచ్చుస్తున్నర ఐఫోన్ యూజర్లు అలర్ట్ కావాలి. ఐఫోన్లలో పెగాసస్ మాల్‌వేర్‌ను పంపేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని యాపిల్ కంపెనీ తెలిపింది. వైరస్‌ను అడ్డుకోవడానికి తాము విడుదల చేసిన సెక్యూరిటీ iOS 16.6.1 అప్‌డేట్‌ను ఐఫోన్, ఐపాడ్‌లలో అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. ‘‘లింకులు పంపకున్నప్పటికీ, యూజర్ ఏమీ చేయకున్నప్పటికీ పెగాసస్ మాల్ వేర్ మీ ఫోన్లలోకి చేరుతుంది. అది చొరబడితే కెమెరా ఆన్ అవడంతోపాటు వాయిస్, ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయి. డివైజ్‌లోని కీలక సమాచారాన్ని హ్యాకర్లు తస్కరిస్తారు’’ అని తెలిపింది. ఐఫోన్ సాఫ్ట్ వేర్‌లోని లోపాలను ‘జీరో డే బగ్స్’ గా ఇంటర్నెట్ వాచ్‌డాగ్ సిటిజన్ ల్యాబ్ తెలిపింది. ఆ లోపాల ఆధారంగా వాషింగ్టన్‌కు చెందిన ఓ ఉద్యోగి పెగాసస్ మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించాడని వెల్లడించింది.





మరోపక్క యాపిల్ కంపెనీకి షేర్ మార్కెట్లో చుక్కలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే కంపెనీ షేర్ల విలువ 6.8 శాతం పడిపోయింది. కంపెనీ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లు తగ్గింది. చైనా నిషేధం దీనికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లో ఐఫోన్ వాడకుండా చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.


Updated : 8 Sept 2023 2:24 PM IST
Tags:    
Next Story
Share it
Top