Home > టెక్నాలజీ > iPhone 15 Issue: ‘ఐఫోన్ మాకొద్దు బాబోయ్’.. యాపిల్కు వెల్లువెత్తిన ఫిర్యాదులు

iPhone 15 Issue: ‘ఐఫోన్ మాకొద్దు బాబోయ్’.. యాపిల్కు వెల్లువెత్తిన ఫిర్యాదులు

iPhone 15 Issue: ‘ఐఫోన్ మాకొద్దు బాబోయ్’.. యాపిల్కు వెల్లువెత్తిన ఫిర్యాదులు
X

మార్కెట్లో ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నా.. ఐఫోన్కే క్రేజ్ ఎక్కువ. అందుకే ధర ఎంత ఎక్కువున్నా కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ఐఫోన్ 15 సిరీస్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫీచర్లు, కెమెరా బాగుండటంతో జనాలు ఎగబడి కొంటున్నారు. స్టాక్ లేదంటే.. వచ్చే వరకు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. అంతా బాగుంది అనుకున్న టైంలో కొత్త సమస్య వచ్చి పడింది. ఈ ఐఫోన్ మాకొద్దు బాబోయ్ అంటూ.. కొనుగోలు దారులు ఫోన్లను.. రిటర్న్ చేస్తున్నారు. కంపెనీకి ఫిర్యాదులు చేస్తూ.. దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఏ యాపిల్ లవర్ అయినా.. ఐఫోన్లలో సెక్యూరిటీతో పాటు ఫీచర్లు బాగుంటాయనే తీసుకుంటారు. అందులో హీటింగ్ సమస్య ఉండకపోవడం కూడా యాపిల్ కు ప్లస్సే. అయితే తాజాగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఫోన్ కాల్ కాసేపు మాట్లాడినా, చార్జింగ్ పెట్టినా, గేమ్స్, వీడియో చాట్ చేసినా ఫోన్ విపరీతంగా హీట్ ఎక్కుతోందట. స్క్రోన్, ఫోన్ వెనక భాగాన్ని అసలు పట్టుకోలేకపోతున్నారట. ముఖ్యంగా ఈ సమస్య చార్జింగ్ పెట్టినప్పుడు ఎక్కువగా ఉంటుందని యూజర్లు చెప్తున్నారు. ఈ విషయంపై కంపెనీకి ఫిర్యాదు చేశారు.

కస్టమర్ల కంప్లైట్స్ పై యాపిల్ టెక్నికల్ టీం స్పందించింది. యూజర్లకు కొన్ని టిప్స్ సూచిస్తుంది. వాటిని ఫాలో అయి హీటింగ్ సమస్య నుంచి తప్పించుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే ఎక్కువగా ఇంటెన్సివ్ యాప్ లు వాడుతున్నప్పుడు, చార్జింగ్ పెడుతున్నప్పుడు, ఫస్ట్ టైం సెట్టింగ్ చేసేటప్పుడు హీటింగ్ సమస్య ఎదురవుతుందని సపోర్ట్ టీం చెప్తున్నారు. అయితే యూజర్లు మాత్రం తమ సమస్యను కంపెనీ సరిగ్గా పట్టించుకోవట్లేదని, అన్ని వేలు ఖర్చు పెట్టి ఫోన్ కొంటే ఇలాంటి సమస్యలు రావడం ఏంటని మండిపడుతున్నారు. ఇంకొందరు ఇది ఐఫోన్ కాదు ఇస్త్రీ పెట్టె అంటూ సటైర్లు వేస్తున్నారు.




Updated : 28 Sep 2023 9:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top