Home > టెక్నాలజీ > వన్ప్లస్కు పోటీగా ఐకూ.. ధర, స్పెసిఫికేషన్స్ కిల్లర్

వన్ప్లస్కు పోటీగా ఐకూ.. ధర, స్పెసిఫికేషన్స్ కిల్లర్

వన్ప్లస్కు పోటీగా ఐకూ.. ధర, స్పెసిఫికేషన్స్ కిల్లర్
X

చైనాకు చెందిన ఐకూ.. ఇండియన్ మార్కెట్ లో మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. నియో సిరీస్ లో భాగంగా.. గతేడాది రిలీజ్ అయిన iQOO Neo 7 ఫోన్ కు సక్సెసర్ గా ఐకూ 9 ప్రోను గురువారం ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఫొటోలు మొబైల్ ఫోన్ అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. iQOO Neo 7తో పోల్చితే.. iQOO Neo 9 Pro ఫోన్ ను మూడు కేటగిరీల్లో అప్ గ్రేడ్ చేసి తీసుకొస్తున్నట్లు కంపెనీ చెప్పింది. కెమెరా, ప్రాసెసర్, లుక్స్ లో మరింత బెటర్ చేశారు. వైబ్రేంట్ కలర్స్, లెదర్ ఫినిష్ తో ఫోన్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్న ఈ ఫోన్.. వన్ ప్లస్ 12 సిరీస్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. తక్కువ ధరలో, ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ తో మార్కెట్ లో విడుదలైన ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్కేయండి.

iQOO Neo 9 Pro specifications:

iQOO Neo 9 Pro సరికొత్త ఫీచర్స్ వస్తున్న ఈ ఫోన్.. స్టార్టింగ్ ధర రూ. 40వేల కంటే తక్కువే. వన్ ప్లస్ కు గట్టి పోటీనిచ్చే iQOO.. ఈసారి కూడా OnePlus 12R కంటే తక్కువ ధరకే తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX920 మెయిన్ కెమెరా.. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 6.78 అంగుళాల Amoled డిస్‌ప్లే,144హెడ్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ వరర్ ఫుల్ ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. ఈసారి బేస్ వేరియంట్.. 8GB RAM + 256GBతో తీసుకొస్తున్నారు. మరో వేరియంట్ 12GB + 256GBగా రాబోతుంది. ఈ మొబైల్ 5,160mAh బ్యాటరీ.. 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో మెయిన్ హైలైట్.

iQOO Neo 9 Pro Price:

ఐకూ 9 ప్రో బేస్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.35,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.37,999గా ఉంది. ఇక హై ఎండ్ 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు అమెజాన్, ఐకూ వెబ్ సైట్ లో ఫిబ్రవరి 23 నుంచి మొదలవుతుండగా.. ప్రీ బుక్‌ చేసుకున్న వారు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం నుంచే కొనుగోలు చేయొచ్చు.




Updated : 22 Feb 2024 10:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top