కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ఇస్రో.. ఎందులో అంటే..?
X
ఇస్రో అంతరిక్షంలోనే కాదు బయట కూడా రికార్డులను సృష్టిస్తోంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ను దించి చరిత్ర సృష్టించిన ఇస్రో.. తాజాగా విరాట్ కోహ్లీ రికార్డునూ బ్రేక్ చేసింది. విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్గా ల్యాండ్ అయిన తర్వాత ఇస్రో ఓ ట్వీట్ చేసింది. చంద్రయాన్ 3 ట్వీట్ చేసినట్లుగానే అది ఉంది. ‘‘నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను. మీరు కూడా. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయంతంగా ల్యాండ్ అయ్యింది. కంగ్రాట్స్ ఇండియా..’’ అని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకర్షించింది. దీనిని 56 మిలియన్ల మంది వీక్షించారు. అంతేకాకుండా 8.50 లక్షల మంది లైక్ కొట్టారు. మన దేశంలో ఇదే అత్యధిక లైకులు కావడం విశేషం. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించిన అనంతరం కోహ్లీ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు 7.96 లక్షల మంది లైక్ కొట్టారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా.. ఇస్రో ధాటికి కోహ్లీ రికార్డు బద్దలైంది. చంద్రయాన్ 3 సక్సెస్ తో సోషల్ మీడియాలో ఇస్రోపై ప్రశంసల జల్లు కురిసింది.
చంద్రుడిపై ఉష్ణోగ్రతలు..
చంద్రుడిపై ఇస్రో పంపిన చంద్రయాన్ 3 రోవర్ ప్రయోగాలను కొనసాగిస్తోంది.విక్రమ్ ల్యాండర్ లోని ChaSTE (చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ పరిమెంట్) పేలోడ్.. చంద్రుడి ఉపరితలంతో పాటు కాస్త లోతులో సేకరించిన సాంపిల్ ఉష్ణోగ్రతల లెక్కలను గ్రాఫ్ రూపంలో తెలిపింది. దీనికున్న పది సెన్సర్ల సాయంతో.. చంద్రుడి నేలపై దాదాపు 10 సెంటిమీటర్ల లోతువరకు చొచ్చుకెళ్లి, టెంపరేచర్ లను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడ్ కు ఉంది. ChaSTE పేలోడ్ పంపిన గ్రాఫ్ను విశ్లేషించిన పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. కాగా చంద్రుడి ఉపరితలంపై 50-60డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు సమాచారం.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3