Home > టెక్నాలజీ > చంద్రయాన్ కంటే పెద్ద లక్ష్యాలు మా ముందున్నాయి : ఇస్రో చైర్మన్

చంద్రయాన్ కంటే పెద్ద లక్ష్యాలు మా ముందున్నాయి : ఇస్రో చైర్మన్

చంద్రయాన్ కంటే పెద్ద లక్ష్యాలు మా ముందున్నాయి : ఇస్రో చైర్మన్
X

అంతరిక్షంలో ఇండియా సంచలనం సృష్టించింది. జాబిల్లిపై సరికొత్త అధ్యాయం లిఖించింది. ప్రపంచంలో ఏ దేశం చేరుకోలేని చంద్రుడి దక్షణ ధృవాన్ని చంద్రయాన్-3 చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సేఫ్గా ల్యాండ్ అయ్యింది. వెయ్యి మంది శాస్త్రవేత్తల కృషి వల్లే ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నారు. ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డామన్న ఆయన.. నాలుగేళ్ల కష్టం ఫలించిందన్నారు.

చంద్రయాన్ కంటే పెద్ద లక్ష్యాలు తమ ముందున్నాయని సోమనాథ్ చెప్పారు. రోదసిలోకి మనిషిని పంపించడమే తమ తొలి లక్ష్యమన్నారు. త్వరలోనే త్వరలో అంగారకుడు, శుక్రుడిపై కూడా ప్రయోగాలు చేపడతామని చెప్పారు. ఇక ఇస్రోకు మద్ధతుగా నిలిచిన ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా చంద్రయాన్‌-3 సక్సెస్ అవ్వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు.

నా జీవితం ధన్యమైంది : మోదీ

చంద్రయాన్ 3 విజయంతో తన జీవితం ధన్యమైందని మోదీ అన్నారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయం అని చెప్పారు. ఇకపై నవతరానికి చందమామపై కొత్త కథలు చెప్పొచ్చు అన్నారు. అజాదీ కా అమృతకాలంలో ఇది తొలి విజయమన్నారు. ‘‘అంతరిక్షంలో కొత్త చరిత్రను సృష్టించాం. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశా. నేను బ్రిక్స్ సదస్సులో ఉన్నా మనసంతా చంద్రయాన్ పైనే ఉంది. సౌరమండలంపై కూడా ప్రయోగాలు చేస్తాం. మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేపడతాం’’ అని మోదీ చెప్పారు.



Updated : 23 Aug 2023 1:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top