Home > టెక్నాలజీ > ISRO Chairman Somnath : ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు క్యాన్సర్‌.. ఆ రోజే నిర్ధారణ

ISRO Chairman Somnath : ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు క్యాన్సర్‌.. ఆ రోజే నిర్ధారణ

ISRO Chairman Somnath  : ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌కు క్యాన్సర్‌.. ఆ రోజే నిర్ధారణ
X

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ క్యాన్సర్‌ బారిన పడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆదిత్య L1 ప్రయోగం రోజునే తనకు కాన్సర్ నిర్థారణ అయిందని సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్ ప్రయోగం సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. కడుపులోని కణితి పెరిగినట్లు అనిపించటంతో పరీక్షలు చేయించుకున్నాని గత సంవత్సరం సెప్టెంబర్ 2న కాన్సర్ ఉన్నట్లు నిర్థరారణ అయిందన్నారు. ఆ రోజునే ఆదిత్య L1 ప్రయోగం చేపట్టామని ఆయన తెలిపారు.

చికిత్స తీసుకున్న తర్వాత కాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాని సోమనాథ్ తెలిపారు. నాకు క్యాన్సర్ అని తెలియగానే మా కుటుంబం, నా ఉద్యోగ సహచరులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నా. కీమోథెరపీ చికిత్స కూడా తీసుకున్నాను. నేను ఆసుపత్రిలో ఉన్నది కేవలం నాలుగు రోజులే. మొదట్లో భయపడ్డాను కానీ, క్యాన్సర్ కు చికిత్స ఉందన్న విషయం ఇప్పుడు నాకు అర్థమైందన్నారు. కీమోథెరపీ చికిత్స కూడా తీసుకున్నాను. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, క్యాన్సర్ నుంచి కోలుకున్నానని తెలిపారు. కడుపులో కణితి పెరిగిందని, ఈ తరహా క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చిందని ఆయన వివరించారు.



Updated : 4 March 2024 6:15 PM IST
Tags:    
Next Story
Share it
Top