Home > టెక్నాలజీ > చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ల్యాండింగ్ ఎందుకంటే..

చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ల్యాండింగ్ ఎందుకంటే..

చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ల్యాండింగ్ ఎందుకంటే..
X

ప్రపంచ మేటి దేశాలకు సాధ్యం కాని ఘనతను.. భారత్ చేసి చూపించింది. మీ వల్ల కాదంటూ.. విమర్శించిన వాళ్ల నోట వేలేసుకునేలా చేసింది. చరిత్రలో ఎవరూ సాహసించని, చేరుకోలేని చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 కాలు మోపింది. విక్రమ్ ల్యాండర్ను చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ చేసి సంచలనం సృష్టించింది. జాబిల్లిపై సరికొత్త అధ్యాయనాన్ని లిఖించింది. అయితే సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు చంద్రుడి దక్షిణ ధ్రువాన్నే ఎందుకు ఎంచుకున్నారనే దానిపై ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ ఆసక్తికర విషయాలను చెప్పారు.

చంద్రుడి దక్షిణ ధ్రువం ల్యాండింగ్ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని సోమనాథ్ తెలిపారు. ఉత్తర ధృవంతో పోలిస్తే.. దక్షిణ ధ్రువంపై సూర్యరశ్మి తక్కువగా ఉంటుందని చెప్పారు. ‘‘ నీరు, ఖనిజాల ఉనికికి సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కవ సైంటిఫిక్ కంటెంట్ దొరికే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో చంద్రుడిపై పరిశోధనలు చేస్తోన్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సాఫ్ట్ ల్యాండింగ్ కు దక్షిణ ధృవాన్ని ఎంచుకున్నాం’’ అని చెప్పారు.

ఇక చంద్రయాన్‌-2 విఫలమవడంతో చంద్రయాన్‌ - 3 విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్‌-2 విఫలమైన మొదటి ఏడాది.. అసలేం తప్పు జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించామన్నారు. ఆ తర్వాతి ఏడాది ఆ లోపాలను సవరించామన్నారు. చివరి రెండేళ్లు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధనల కోసం రూపొందించిన ఆదిత్య మిషన్‌.. సెప్టెంబరులో ప్రయోగిస్తామన్నారు. భారత మానవసహిత అంతరిక్ష మిషన్‌ ‘గగన్‌యాన్ను 2025 నాటికి నిర్వహించే అవకాశం ఉందన్నారు.

కాగా విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే పని మొదలుపెట్టింది. చంద్రుని ఉపరితలానికి సంబంధించిన చిత్రాలను భూమికి పంపింది. రోవర్ ప్రజ్ఞాన్ పంపిన తొలి ఫొటోను ఇస్రో రిలీజ్ చేసింది. ఆ ఫొటోలో ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు రావడం కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.



Updated : 24 Aug 2023 5:42 PM IST
Tags:    
Next Story
Share it
Top