Home > టెక్నాలజీ > చంద్రుడిపై సూర్యోదయం.. ల్యాండర్, రోవర్ నిద్రలేస్తాయా..?

చంద్రుడిపై సూర్యోదయం.. ల్యాండర్, రోవర్ నిద్రలేస్తాయా..?

చంద్రుడిపై సూర్యోదయం.. ల్యాండర్, రోవర్ నిద్రలేస్తాయా..?
X

ప్రస్తుతం జాబిలమ్మ ఒడిలో చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ నిద్రపోతున్నాయి. సుమారు 14 రోజుల తర్వాత చంద్రడిపై మళ్లీ సూర్యకాంతి వచ్చింది. దీంతో వాటిని నిద్రలేపడానికి ఇస్రో సిద్ధమైంది. విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ లతో కమ్యూనికేషన్ కోసం ఇస్రో ప్రయత్నిస్తోంది. అయితే అక్కడ అత్యంత శీతల ఉష్ణోగ్రతలను తట్టుకొన్న అవి.. తిరిగి మనుగడ సాగిస్తాయా అన్నది ఆసక్తిగా మారింది. సూర్యరశ్మిని గుర్తించి ల్యాండర్, రోవర్ మళ్లీ పని ప్రారంభించే ప్రక్రియ అంతా పూర్తి ఆటోమేటిగ్గా జరుగుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పష్టం చేశారు.

చంద్రుడిపై రాత్రి కావడంతో ఈ నెల 3న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపించింది. అప్పటికే ల్యాండర్, రోవర్ తమ పనులను కంప్లీట్ చేశాయి. ఒకవేళ ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేస్తే జాబిల్లిపై చంద్రయాన్‌-3 ప్రయోగాలకు బోనస్‌ లభించినట్లు అవుతుంది. కాగా జులై 14న ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టగా.. అగస్ట్ 23న చంద్రడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత దానిలోని రోవర్ బయటకు వచ్చి తమ పనిని పూర్తిచేశాయి.


Updated : 22 Sept 2023 9:30 AM IST
Tags:    
Next Story
Share it
Top