పని మొదలెట్టిన రోవర్.. ఫస్ట్ ఫోటో రిలీజ్ చేసిన ఇస్రో
X
బుధవారం చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే పని మొదలుపెట్టింది. చంద్రుని ఉపరితలానికి సంబంధించిన చిత్రాలను భూమికి పంపింది. రోవర్ ప్రజ్ఞాన్ పంపిన తొలి ఫొటోను ఇస్రో రిలీజ్ చేసింది. ఆ ఫొటోలో ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు రావడం కనిపించింది. కాగా ప్రస్తుతం ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
"First photo of Rover coming out of the lander on the ramp", tweets Pawan K Goenka, Chairman of INSPACe
— ANI (@ANI) August 24, 2023
(Pic source - Pawan K Goenka's Twitter handle) pic.twitter.com/xwXKhYM75B
ఆరు చక్రాలున్న రోబోటిక్ వెహికిల్ ప్రజ్ఞాన్ బుడి బుడి అడుగులు వేస్తూ చంద్రునిపై తన ప్రయాణాన్ని సాగిస్తోంది. ఉదయం 9 గంటల సమయంలో ల్యాండర్ నుంచి కొంత దూరం వచ్చిన రోవర్ చుట్టుపక్కలున్న ప్రదేశాలను ఫోటో తీసి ఇస్రోకు పంపింది. ఎత్తైన పర్వతాలు, మైదానాలు ఉన్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#Chandrayaan3: #Pragyan touched down to the moon and started its 14 day long journey to explore the moon surface #IADN pic.twitter.com/Ic4iF4uzmH
— Indian Aerospace Defence News - IADN (@NewsIADN) August 24, 2023