Home > టెక్నాలజీ > Aditya L1 Mission : సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్ 1..ఇస్రో మరో కీలక విన్యాసం

Aditya L1 Mission : సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్ 1..ఇస్రో మరో కీలక విన్యాసం

Aditya L1 Mission : సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్ 1..ఇస్రో మరో కీలక విన్యాసం
X

సూర్యుడి సీక్రెట్స్‎ను చేధించడానికి, సూర్యగ్రహంపై సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో.. ఆదిత్య ఎల్1 అనే ఉపగ్రహాన్ని సూర్యుడి చెంతకు పంపిస్తోంది. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆదిత్య ఎల్1 సూర్యుడి వైపు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్ 1 ప్రయాణానికి సంబంధించిన మరో లేటెస్ట్ అప్‎డేట్ వచ్చేసింది. ప్రస్తుతం భూ కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తోన్న ఆదిత్య ఎల్ 1ఉపగ్రహం భూకక్ష్య పెంపును ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు విజయవంతంగా నిర్వహించారు. ఆదిత్య ఎల్1 ప్రయోగం అనంతరం దాని భూకక్ష్యను మార్చడం ఇది నాలుగోసారి. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ ఆపరేషన్‎ను సక్సెస్‏ఫుల్‎గా పూర్తి చేశారు సైంటిస్టులు.

మారిషస్‌, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్‌ స్టేషన్లు ఈ ప్రక్రియను దగ్గరుండి మరీ మానిటర్ చేశాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2: 15 నిమిషాల సమయంలో మారిషస్‌లోని గ్రౌండ్ స్టేషన్ నుంచే ఆదిత్య ఎల్ 1 క‌క్ష్య‌ను మార్చిన‌ట్లు ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఇస్రో తాజా విన్యాసంతో

ప్రస్తుతం ఆదిత్య ఎల్ 1 256 km x 121973 km కక్ష్యలోకి ఎంటర్ అయ్యింది. సెప్టెంబర్ 19న మ‌రోసారి కక్ష్య పెంపు విన్యాసాన్ని ఇస్రో చేపట్టనుంది. ఈ శాటిలైట్ మరో 16 రోజుల పాటు భూకక్ష్యలోనే ట్రావెల్ చేస్తుంది. లాగ్రాంజ్ పాయింట్ 1లో చేర్చేందుకు ఇస్రో కనీసం 5 సార్లు భూకక్ష్య‌ను మార్చాల్సి ఉంటుంది.15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్‌-1 పాయింట్‌ను చేరుకునేందుకు ఈ ఉపగ్రహానికి నాలుగు నెలల సమయం పడుతుంది.

Updated : 15 Sept 2023 9:21 AM IST
Tags:    
Next Story
Share it
Top