Home > టెక్నాలజీ > చంద్రయాన్ 3 లో కీలక ఘట్టం.. నెక్ట్స్ చంద్రుడిపైనే..

చంద్రయాన్ 3 లో కీలక ఘట్టం.. నెక్ట్స్ చంద్రుడిపైనే..

చంద్రయాన్ 3 లో కీలక ఘట్టం.. నెక్ట్స్ చంద్రుడిపైనే..
X

జాబిల్లి లక్ష్యంగా చంద్రయాన్ 3 ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఈ ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతంగా పూర్తైంది. ఒక్కో దశను దాటుకుంటూ దూసుకెళ్తున్న చంద్రయాన్ 3.. ఇప్పటికే 5దశలను దాటింది. ఇక ఆరో దశ అయిన చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. భూమి చుట్టూ కక్ష్యలను పూర్తి చేసిన చంద్రయాన్ 3.. ప్రస్తుతం జాబిల్లవైపు వెళ్తోందని ఇస్రో తెలిపింది.

సోమవారం అర్ధరాత్రి వ్యోమనౌకను ట్రాన్స్‌లూనార్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది. ఇక తర్వాత గమ్యం చంద్రుడేనని, మరో ఐదు రోజుల్లోఆగస్టు 5 నాటికి చంద్రుడి కక్ష్యకు చేరుకుంటుందని వెల్లడించింది. కాగా ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. చంద్రయాన్-3.. చంద్రుడి కక్షలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రయాణం మరింత కీలకంగా మారింది. ఒకవేళ ఆ సమయానికి పరిస్థితులు ల్యాండింగ్ కి అనువుగా లేకపోతే.. మరో నెల రోజుల పాటు రోవర్ కక్షలోనే ఉంటుంది.

చంద్రుని వెనకవైపున్న దక్షిణ భాగ రహస్యాల్ని వెలికి తీయడమే. ఈ భాగంలో సూర్యుడు పడడు. దాంతో ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. ఈ ప్రయోగం వల్ల భవిష్యత్తులో అక్కడ నివాసం ఉండొచ్చో లేదో తెలుసుకోవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. అమెరికా, చైనాలను సాధ్యం కాని విషయాన్ని భారత్ చేసినట్లు అవుతుంది.

Updated : 1 Aug 2023 3:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top