Home > టెక్నాలజీ > మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
X

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ అంచనాలను తెలుసుకునేందుకు మరో ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం జీఎస్‌ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ (GSLV-F14/INSAT-3DS) ను ప్రయోగించనుంది. ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటల నుంచి ఆ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. జీఎస్ఎల్‌వీ-ఎఫ్14‌ రాకెట్ ను ప్రయోగించనుంది. ఈ మేరకు ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఇస్రో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఇస్రో ప్రయోగించే ఆ జీఎస్ఎల్వీ మూడు దశల లాంచ్ వెహికల్ అని, అది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువుతో ఉంటుందని ఇస్రో తెలిపింది. వాతావరణ పరిశీలన కోసం ఇస్రో ఆ ఇన్నాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని రూపొందించినట్లుగా చెప్పుకొచ్చింది. వాతావరణ విపత్తులను, మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని ఇస్రో వెల్లడించింది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుగా తెలిపింది.



Updated : 8 Feb 2024 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top