Home > టెక్నాలజీ > PSLV-C58: కౌంట్‌డౌన్ స్టార్ట్.. రేపే నింగిలోకి ఎక్స్‌పోశాట్‌

PSLV-C58: కౌంట్‌డౌన్ స్టార్ట్.. రేపే నింగిలోకి ఎక్స్‌పోశాట్‌

PSLV-C58: కౌంట్‌డౌన్ స్టార్ట్.. రేపే నింగిలోకి ఎక్స్‌పోశాట్‌
X

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో మంచి ఊపు మీద ఉన్న ఇస్రో.. 2024 ఏడాదిని ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగించనుంది. రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాలను ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం నిర్వహించారు. ఇందులో రాకెట్‌ అనుసంధానం, ఉపగ్రహ అమరిక, పరీక్షలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ పీఎస్ఎల్‌వీ - సీ58 రాకెట్ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. 25 గంటలపాటు కొనసాగనున్న కౌంట్‌డౌన్.. సోమవారం ఉదయం 9.10 గంటల వరకు కొనసాగనుంది.

పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి రేపు దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌ 4..10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈమారు ఎక్స్-రే‌తో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లు. ఎక్స్‌పోశాట్ ఉపగ్రహం.. భారత్ అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన గత ప్రయోగాల లాగా కాకుండా.. ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ లక్ష్యమని పేర్కొన్నారు.




Updated : 31 Dec 2023 10:53 AM IST
Tags:    
Next Story
Share it
Top