ISRO XPoSat launch : కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం.. ఎక్స్‌పోశాట్ గ్రాండ్ సక్సెస్
X
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్‌హోల్) అధ్యయనమే లక్ష్యంగా PSLV-C58 రాకెట్‌ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిప్పులుచిమ్ముతూ రోదసీలోకి దూసుకెళ్లిన వాహకనౌక.. 21 నిమిషాల తర్వాత కక్షలోకి ప్రవేశించి విజయవంతం అయింది. దీంతో శ్రీహరి కోటలోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. కాగా ఈ ఎక్సో పోశాట్ ఉపగ్రహం ఐదు సంవత్సరాల పాటు పనిచేయనుంది. ఇందులో రెండు పేలోడ్స్ ఉన్నాయి. ఒకటి పాలిఎక్స్, రెండోది ఎక్స్-రే స్పెక్ట్రోసోపీ టైమింగ్. మొదటిదికి ఎక్స్ కిరణాలను పొలారిమీటర్. దీన్ని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసింది. రెండో పరికరాన్ని స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది.
PSLV-C58/XPoSat Mission:
— ISRO (@isro) January 1, 2024
Lift-off normal 🙂
🛰️XPoSat satellite is launched successfully.
🚀PSLV-C58 vehicle placed the satellite precisely into the intended orbit of 650 km with 6-degree inclination🎯.
The POEM-3 is being scripted ...#XPoSat
ఎక్స్‌పోశాట్ శాటిలైట్‌ను ఉదయం 9.10నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ప్రయోగం మొదటి నుంచి అనుకున్న లక్ష్యం దిశగా పీఎస్‌ఎల్‌వీ సీ 58 దూసుకెళ్లింది. ఈ వాహకంతో ఎక్స్‌పోశాట్‌తోపటు మరో పది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8 గంటల పది నిమిషాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. ఈ ఉదయం 9 గంటల పది నిమిషాలకు ప్రయోగించారు. ఇది భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్... ప్రపంచంలో రెండోది. అమెరికా తర్వాత ఈ ప్రయోగం చేసిన రెండో దేశంగా కొత్త చరిత్ర సృష్టించింది. పల్సర్‌లు, బ్లాక్‌హోల్ ఎక్స్‌రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్‌పై ఎక్స్‌పోశాట్ స్టడీ చేయనుందీ ఉపగ్రహం. అంతకు ముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రయోగ రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు.