అదిరిపోయే ఫీచర్స్తో.. రూ. 9వేలకే స్మార్ట్ ఫోన్
X
బడ్జెట్ రేంజ్ లో స్మార్ట్ ఫోన్ లు తీసుకురావడానికి చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ బాటలోనే ఐటెల్ నడుస్తోంది. మిడిల్ క్లాస్ అందుబాటు ధరలో, అదిరిపోయే ఫీచర్స్ తో ‘Itel P40+’ పేరుతో మొబైల్ ఫోన్ ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ లాంచ్ గురించి అమెజాన్ మైక్రోసైట్ లో లిస్ట్ చేశారు. అయితే దీని ధర రూ. 9వేల లోపు ఉంటుందని అంచనా. అంతేకాకుండా లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ కార్డ్స్ పై కూడా స్పెషల్ డిస్కౌంట్స్ అందిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ ఫోన్ ఫీచర్స్ అధికారికంగా విడుదల కాకపోయినా.. కొన్ని టెక్ సంస్థల నివేదిక ప్రకారం ఇది 6.8 ఇంచ్ హెచ్డీ+ (1200x720) ఎల్ సీడీ డిస్ ప్లేతో వస్తుంది.
4GB ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో.. యూనిసాక్ T606 SoC ప్రాసెసర్ తో రాబోతోంది. 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్ తో 7000mAh బ్యాటరీతో రానుంది. 7000 ఎంఏహెచ్ మెగా బ్యాటరీతో 41 గంటల పాటు కాల్స్, 14 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్ చేయొచ్చు. అంతేకాకుండా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది.