జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. ఆ ప్లాన్పై అదనపు వ్యాలిడిటీ
X
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న క్రమంలో.. వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ ను ప్రవేశపెట్టింది. వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉన్న రీచార్జ్ ప్లాన్ పై హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024 పేరిట ఎక్స్ ట్రా వ్యాలిడిటీని అందిస్తుంది. కాగా జియో ప్రీపెయిడ్ యూజర్లకు ఈ ప్లాన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2999తో 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్లాన్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లతో పాటుగా.. 2.5 జీబీ డేటాను (912 జీబీ డేటా) అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం జియో తీసుకొచ్చిన న్యూ ఇయర్ ఆఫర్ లో.. రూ.2999తో రీచార్జ్ చేసుకుంటే.. 24 రోజుల అదనపు వ్యాలిడిటీ అందనుంది. అంటే ప్రస్తుతం 365 రోజుల ప్లాన్.. ఇకపై 389 రోజులు వినియోగించుకోవచ్చ అన్నమాట. దీంతో పాటు.. జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా సంవత్సరం అంతా ఫ్రీగా చూడొచ్చు.