ఫోన్ పౌచ్లో డబ్బులు పెడుతున్నారా? జాగ్రత్త
X
ప్రతీ ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ బాగం అయిపోయింది. ఇది వరకు పర్స్ లు, హ్యాండ్ బ్యాగ్ లు పట్టుకుని వెళ్లేవాళ్లు.. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలంటూ బయటకు వెళ్తున్నారు. మరీ అంతలా క్యాష్ అవసం పడితే.. వందో, ఐదు వందలో ఫోన్ వెనక పౌచ్ లో పెట్టుకుని వెళ్లిపోతున్నారు. ఇది చాలామందికి అలవాటైపోయింది. అవసరం ఉండి కొందరు, లక్కీ నోటు అని ఇంకొందరు.. ఫోన్ వెనకాల కరెన్సీ నోటు పెట్టు తిరుగుతున్నారు. అయితే ఈ అలవాటు చాలా ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు.
కొన్నిసార్లు మనం తెలియక చేసే పనులు అనార్థాలకు దారి తీస్తాయి. ఫోన్ వెనకాల కరెన్సీ నోట్లు ఎందుకు పెట్టొదంటే.. నోట్ల తయారీకి ప్రత్యేక కాగితంతోపాటు అనేక రసాయనాలు వాడతారు. వీటిని ఫౌన్ పౌచ్ లో ఉంచితే ఫోన్ నుంచి వేడి బయటకు వెళ్లకుండా ఆగిపోతుంది. దాని వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయి.. పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నోట్లతో పాటు షాపింగ్ బిల్స్ లాంటివి కూడా పెట్టొద్దని సూచిస్తున్నారు. అంతేకాకుండా మరీ బిగుతుగా ఉండే పౌచ్ లు కాకుండా మొబైల్ నుంచి వేడి బయటకు వెళ్లే వీలుండేవి తీసుకోవాలని బెటర్ అని సూచిస్తున్నారు.