Home > టెక్నాలజీ > ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్​ డ్రైవ్​..త్వరలో విడుదల

ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్​ డ్రైవ్​..త్వరలో విడుదల

ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్​ డ్రైవ్​..త్వరలో విడుదల
X

ఇండియాలో ఆటో మొబైల్ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మంట్‌పై కియా మోటార్స్ ఫోకస్ చేసింది.

ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ, ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతార్జాతీయంగా అధికంగా సెల్లింగ్‌గా ఉన్న కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్ యూవీనీ 2024లో ఇండియాలో విడుదల చేస్తామని గతంలో చెప్పింది. తాజగా కియా ఈవీ9 సంబంధించిన కీలక అప్డేట్ బయటికి వచ్చింది. ఈ కారుని త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

కియా ఈవీ9 ఫీచర్స్​..

కియా ఈవీ9 అనేది ఒక ప్రీమియం కారు. ఇందులో బ్లాంక్​డ్​ ఆఫ్​ గ్రిల్​, వర్టికల్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఇంటిగ్రేటెడ్​ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​, ఫ్లష్​ ఫిట్టెడ్​ డోర్​ హ్యాండిల్స్​ వంటివి వస్తున్నాయి. ఇందులో 21 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ వీల్స్​ ఉంటాయి.ఇక ఈ 3 రో ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఇంటీరియర్​ చాలా స్పేషియస్​గా ఉంటుంది. డిజైన్​ మినిమలిస్ట్​గా ఉంటుంది. 4 స్పోక్​ స్టీరింగ్​ వీల్​, పానారోమిక్​ సన్​రూఫ్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​- ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కోసం భారీ స్క్రీన్​ వంటివి వస్తున్నాయి.ఈ-జీఎంపీ (ఎలక్ట్రిక్​ గ్లోబల్​ మాడ్యులర్​ ప్లాట్​ఫామ్​)పై ఈ కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని రూపొందించింది కియా మోటార్స్​.

దీని పొడవు 5,000ఎంఎం. వీల్​బేస్​ 3,1000ఎంఎం. సైజు పరంగా చూసుకుంటే.. ఈ వెహికిల్​ చాలా పెద్దదే. అంతర్జాతీయంగా ఉన్న కియా ఈవీ9లో రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి.. 76.1 కేడబ్లూహెచ్​, 99.8 కేడబ్ల్యూహెచ్​. ఈ ఈవీ రేంజ్​ 540కి.మీలు. 800వోల్ట్​ అల్ట్రా ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఈ కియా ఎలక్ట్రిక్​ వెహికిల్​కి లభిస్తోంది. మరి ఇండియాలో.. ఏ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది? అనేది వేచి చూడాలి. కియా ఈవీ9 ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ ఇదొక ప్రీమియం కారు కాబట్టి.. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 40లక్షల కన్నా ఎక్కువగానే ఉంటుంది మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కియా ఈవీ9 ఇతర ఫీచర్స్​, లాంచ్​ డేట్​పైనా క్లారిటీ లేదు. త్వరలోనే ఈ మోడల్​పై కియా కంపెనీ ప్రకటన చేసే అవకాశం ఉంది.

Updated : 3 Feb 2024 4:37 PM IST
Tags:    
Next Story
Share it
Top