Home > టెక్నాలజీ > కెమెరా లెన్స్ ఆర్డర్ చేసిన కస్టమర్.. అమెజాన్ పంపిన పార్శిల్ చూసి మైండ్ బ్లాక్..

కెమెరా లెన్స్ ఆర్డర్ చేసిన కస్టమర్.. అమెజాన్ పంపిన పార్శిల్ చూసి మైండ్ బ్లాక్..

కెమెరా లెన్స్ ఆర్డర్ చేసిన కస్టమర్.. అమెజాన్ పంపిన పార్శిల్ చూసి మైండ్ బ్లాక్..
X

ఆన్‌లైన్‌ షాపింగ్.. ఇప్పుడు చాలా మంది చేస్తున్నది ఇదే. ఈ కామర్స్ సైట్లలో ఒక్క క్లిక్తో కోరుకున్న వస్తువు ముంగిట్లోకి వచ్చేస్తోంది. దీంతో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్నే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే చేతికందేది మరొకటవుతుంది. చాలా మందికి ఇలాంటి ఎక్స్ పీరియెన్స్ జరిగే ఉటుంది. తాజాగా కస్టమర్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రూ.90వేలు పెట్టి కొన్న వస్తువుకు బదులుగా అమెజాన్ రూ.90 విలువైన సరుకు పంపి షాకిచ్చింది.

లెన్స్ ఆర్డర్

అరుణ్ కుమార్ అనే వ్యక్తి కెమెరా లెన్స్ కొనాలనుకున్నాడు. అమెజాన్ లో సెర్చ్ చేసి సిగ్మా 24-70 ఎఫ్ 2.8 లెన్స్ నచ్చడంతో జూలై 5న ఆర్డర్ పెట్టాడు. ప్రొడక్ట్ డెలివరీ కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేశాడు. మరుసటి రోజు పార్మిల్ ఇంటికి రానే వచ్చింది. అరుణ్ కుమార్ వెంటనే దాన్ని ఓపెన్ చేశాడు. అందులో ఉన్న వస్తువు చూసి మనోడి మైండ్ బ్లాంకైంది.

పార్శిల్లో క్వినోవా

పార్శిల్లో తాను ఆర్డర్ చేసిన కెమెరా లెన్స్‌కు బదులు క్వినోవా సీడ్స్ ప్యాకెట్ కనిపించాయి. కెమెరా లెన్స్ బ్యాగ్, బాక్స్‌ కరెక్ట్‌గానే ఉన్నా అందులో మాత్రం ఉండాల్సిన లెన్స్‌కి బదులు క్వినోవా సీడ్స్ ప్యాకెట్‌ని పెట్టారు. ఇది చూసిన వెంటనే తీవ్ర అసహనానికి గురైన అరుణ్ ట్విటర్‌లో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. పనిలో పనిగా అమెజాన్ కస్టమర్ కేర్ కు కంప్లైంట్ చేశారు. తనకు లెన్స్ పంపాలని లేదా తన సొమ్ము తనకు రిఫండ్ చేయాలని కోరాడు.

స్పందించిన అమెజాన్

అరుణ్ కంప్లైంట్ పై ఎట్టకేలకూ అమెజాన్ స్పందించింది. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరింది. డైరెక్ట్ మెసేజ్ చేస్తే సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని సూచించింది. పర్సనల్ డీటెయిల్స్ అయిన ఆర్డర్, అకౌంట్ వివరాలను మాత్రం పంపొద్దని చెప్పింది. ఈ కామర్స్ సైట్లలో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. జులై 8న ఓ మహిళ అమెజాన్ లో రూ.50,900 విలువైన యాపిల్ వాచ్ సీరిస్ 8 ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు యాపిల్ వాచ్ బదులుగా పార్సిల్లో ఫేక్ రిస్ట్ వాచ్ పంపారు. దీంతో సదరు మహిళ అమెజాన్ కు కంప్లైంట్ చేసింది.

Updated : 16 July 2023 2:27 PM IST
Tags:    
Next Story
Share it
Top